Chiranjeevi, Anil Ravipudi: మెగాస్టార్ – అనిల్ రావిపూడి.. కిక్కిచ్చే లీక్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. మాస్ నుంచి క్లాస్ వరకు అన్ని జానర్లలో అదరగొట్టారు. అయితే, ఆయన కామెడీ టైమింగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కంబ్యాక్ తర్వాత పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ చేయని చిరు, ఎట్టకేలకు ఆ కోరికను అనిల్ రావిపూడి (Anil Ravipudi)  సినిమాతో తీరుస్తున్నట్లు టాక్. చిరు 157వ సినిమాకు అనిల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట.

Chiranjeevi, Anil Ravipudi:

లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ రెండు పాత్రలు పూర్తిగా విభిన్నంగా ఉండబోతున్నాయి. ఒకటి క్లాసిక్ కామెడీ రోల్ అయితే, మరొకటి పూర్తిగా సీరియస్ షేడ్‌లో ఉంటుందని అంటున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఫన్, చిరు టైమింగ్ కలిస్తే స్క్రీన్‌పై పక్కా పండగే. చిరు చివరిసారిగా ఈ స్థాయి కామెడీ టచ్‌లో కనిపించినది వాల్తేరు వీరయ్య లో. కానీ అది మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో పూర్తి స్థాయి కామెడీని మిస్ అయ్యారు.

ఈసారి, అనిల్ స్క్రిప్ట్‌లో హాస్యం కూర్చి పక్కా ఫన్ రైడ్‌ను సిద్ధం చేశారట. చిరు కూడా ఈ స్టోరీ విన్న వెంటనే ఒకే చెప్పారట. ఇక ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం, కోదండరామిరెడ్డి సినిమాలు చేస్తున్నట్టే అనిపిస్తోందని చిరు అనీల్‌కు అన్నారని ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. చిరు కెరీర్‌లో చాలా కాలం తర్వాత పక్కా కామెడీ అనే ట్యాగ్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో చిరంజీవి పక్కన హీరోయిన్లు ఇంకా ఫైనలైజ్ కాలేదు.

అనీల్ ఈ సినిమాను హై లెవెల్ లోనే ప్లాన్ చేస్తున్నారట. ఇక ఫ్యాన్స్ అయితే ఈ లేటెస్ట్ లీక్ విని హుషారెత్తిపోతున్నారు. మళ్లీ మెగాస్టార్ డబుల్ రోల్‌లో, అదీ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తారంటే, థియేటర్లలో నవ్వుల వర్షం ఖాయం. మొత్తానికి చిరు 157 అంటే పక్కా కామెడీ మాస్ ఎంటర్‌టైనర్ అని ఫిక్స్. అనిల్ రావిపూడి ప్లాన్ ప్రకారం, ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టాక్. మరి చిరు డబుల్ రోల్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

హిట్ 3 vs కింగ్ డమ్.. బజ్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus