Chiranjeevi: మీడియాపై మండిపడిన మెగాస్టార్ చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మలయాళంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కి విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

గాడ్ ఫాదర్ సినిమా హిట్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం శనివారం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పుడు ఎవరిపై ఎలాంటి కోపాన్ని ప్రదర్శించని చిరంజీవి మొదటి సారి మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా వారి ఎల్లప్పుడూ ఒకరికి సహాయ పడేవిధంగా ఉండాలి కానీ గాడ్ ఫాదర్ విషయంలో మీడియా వ్యవహారం తమను ఎంతో బాధ పెట్టిందని చిరంజీవి పేర్కొన్నారు. సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదని,సినిమాకు ఏ విధమైనటువంటి హైప్ ఏర్పడలేదంటూ వార్తలు రాశారు. మేం ఏం చేయాలో కూడా మీరే నిర్ణయిస్తే ఎలా అంటూ మండిపడ్డారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గురించి కూడా మాట్లాడుతూ అనంతపురంలో ఎంతో మంది అభిమానుల మధ్య ఈ వేడుక జరిగింది జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ నా ప్రసంగాన్ని ఆపకుండా మాట్లాడాను.

ఒకవేళ నేను నా ప్రసంగాన్ని మధ్యలో ఆపి కనుక ఉంటే ఈ విషయంపై ఎన్నో వార్తలు రాసి కంపు చేస్తుందన్న భయంతోనే తాను వర్షంలో కూడా మాట్లాడాలని తెలిపారు. ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో సినిమా గురించి అద్భుతంగా రాసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసిన మీడియా బృందానికి కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus