Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్ తో గట్టెక్కేసిన ప్లాప్ సినిమా అది..!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బాక్సాఫీస్ స్టామినా గురించి ఇప్పటి జనరేషన్ కి పూర్తిగా తెలియదు అనే చెప్పాలి. పక్క సినిమాల వేడుకలకి చిరంజీవి గెస్ట్ గా వస్తుంటే.. సినిమా వాళ్ళు ఆయన్ని పొగుడుతుంటే… ఆ వైబ్ ని వాళ్ళు ఫీలవ్వలేకపోతున్నారు. కానీ తమిళనాడులో ఇప్పుడు రజినీకాంత్ అనుభవిస్తున్న స్టార్ డమ్ కి.. 10 రెట్లు 18 ఏళ్ళ క్రితమే చిరంజీవి అనుభవించి వచ్చారు అనేది చాలా మందికి తెలీదు. చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. థియేటర్ల వద్ద వందల సంఖ్యలో జనం గుమిగూడేవారు.

Chiranjeevi

బ్లాక్ లో రూ.500 పెట్టి కొందామన్నా టికెట్లు దొరికేవి కాదు. టికెట్లు దొరికిన వాళ్ళు అయితే.. జీవితంలో ఏదో సాధించినట్లు పండుగలు చేసుకునేవారు. హిట్ సినిమాకి అయినా ఫ్లాప్ సినిమాకి అయినా.. ఇదే మేనియా ఉండేది. సినిమా ఒరిజినల్ టాక్ బయటకు రావడానికి కనీసం వారం పట్టేది. ఈ గ్యాప్లో బయ్యర్స్ అంతా సేఫ్ జోన్లోకి వచ్చేసేవారు.

అలా కొన్ని ప్లాప్ సినిమాలు కూడా గట్టెక్కేసేవి. పూర్తిగా కాకపోయినా.. ఆల్మోస్ట్ ఇలాంటి కోవలోకే వస్తుంది ‘ఇద్దరు మిత్రులు’ అనే సినిమా. చిరంజీవి హీరోగా రమ్యకృష్ణ (Ramya Krishnan) హీరోయిన్ గా సాక్షి శివానంద్ (Sakshi Shivanand) కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకులు. 1999 ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. ‘చిరంజీవి ఇలాంటి సినిమా ఎలా చేశారు’ అంటూ ఫ్యాన్స్ నెత్తిన కొట్టుకున్నారు.

ఆయన ఇమేజ్ కి ఏమాత్రం మ్యాచ్ కానీ కథ ఇది. చిరు సినిమాల్లో ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో ఉండదు. కానీ చిరు – కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్లో ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు వచ్చాయి. అలా ఈ సినిమా పాస్ మార్కులతో బయటపడింది. అయినప్పటికీ 25 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 26 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

నాగార్జున సినిమా గురించి దర్శకుడు సంచలన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags