Chiranjeevi: విశ్వంభర విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఆ సెంటిమెంట్ పాటిస్తున్నారా?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కెరీర్ పరంగా బిజీగా ఉండగా చిరంజీవి నటిస్తున్న విశ్వంభర (Vishwambhara) సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక విషయంలో మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమాను ఫాలో అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అంజి (Anji) సినిమా 2004 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవలేదు.

ఈ సినిమా నిర్మాతలకు సైతం భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా ఆరేళ్ల పాటు జరగగా సినిమా అంతటా చిరంజీవి ఒకే క్యాస్టూమ్ లో ఎక్కువగా కనిపిస్తారనే సంగతి తెలిసిందే. విశ్వంభర సినిమాలో సైతం మెగాస్టార్ చిరంజీవి ఒకే క్యాస్టూమ్ లో కనిపిస్తారని తెలుస్తోంది. విశ్వంభర విషయంలో మెగాస్టార్ చిరంజీవి అంజి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో చిరంజీవి ఈ సినిమాకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, త్రిష (Trisha) కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. స్టాలిన్ (Stalin) సినిమా తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. త్రిష ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తారని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

త్వరలో విశ్వంభర సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ రానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వంభర సినిమా 2025 సంవత్సరం జనవరి 10వ తేదీన విడుదల కానుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి నంబర్ వన్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus