మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలకి ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాలు రిలీజ్ అయ్యాక పలు చోట్ల ఆల్ టైం రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నాయి. సో ఆయన ఇంపాక్ట్ ఇప్పుడు చాలా ఉంది. కాకపోతే ప్రభాస్, అల్లు అర్జున మాదిరి పాన్ ఇండియా సినిమాలు చేసి ఆయన సక్సెస్ అవగలరా? అనే డౌటే అని ‘సైరా’ రిజల్ట్ తో తేలిపోయింది. తెలుగులో బాగా ఆడిన ఈ మూవీ మిగిలిన అన్ని భాషల్లోనూ నిరాశపరించింది.
స్పెషల్ గా హిందీ మార్కెట్ కోసం ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ ను రంగంలోకి దింపారు. అయినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. చిరుకి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. నిజానికి ఆయనే డైరెక్ట్ చేయాలనుకున్నారు కానీ పాన్ ఇండియా సినిమా అనేసరికి సురేందర్ రెడ్డికి అప్పగించారు. అయితే అమితాబ్ కలిసిరాలేదు అని ఇప్పుడు సల్మాన్ వెంట పడ్డారు చిరు. ఆయన నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం కోసం సల్మాన్ ఖాన్ ను ఓ కీలక పాత్రకి ఎంపిక చేసుకున్నారు.
ప్రస్తుతం ముంబైలో వీరి కాంబినేషన్లో కొన్ని సీన్ల చిత్రీకరణ జరుగుతుంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్. అది తెలుగులో డబ్ అయినప్పటికీ చిరు అభిమానుల అభిరుచికి తగ్గట్టు ఎన్నో మార్పులు కూడా చేశారు. ఈ క్రమంలో హిందీ మార్కెట్ కోసం సల్మాన్ ను తీసుకున్నారు. అమితాబ్ ఎలాగూ కలిసి రాలేదు. మరి అక్కడ రూ.200 కోట్లు మార్కెట్ కలిగిన సల్మాన్ ఖాన్ కలిసొస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇంకో విషయం ఏంటంటే ఈ చిత్రంలో సల్మాన్ కనిపించేది గట్టిగా 10 నిముషాలు మాత్రమే.గతంలో సల్మాన్ గెస్ట్ రోల్స్ ఇచ్చినప్పటికీ కొన్ని హిందీ సినిమాలకే పెద్దగా వర్కౌట్ అయ్యింది లేదు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!