మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఫిలిం ఫెడరేషన్ మేడే ఉత్సవాలు

మే ఒకటిన హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ లోని అన్ని విభాగాలు (24 క్లాప్స్ ) తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తుంది. దాదాపు పది వేలమంది తో భారీస్థాయి లో మేడే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్. ఈ సందర్బంగా శనివారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, దర్శకుల సంగం అధ్యక్షుడు కాశీ విశ్వనాధ్ లతో పాటు 24 క్రాఫ్ట్ కు సంబందించిన అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ..

Click Here To Watch Now

దర్శకుల సంఘం అధ్యక్షుడు కాసి విశ్వనాధ్ మాట్లాడుతూ .. అందరికి పండగలు ఉంటాయి ఆలాగే సినిమా ఇండస్ట్రీ కి కూడా ఓ పండగ ఉంటుంది. అదే మేడే. ఆ రోజున గ్రాండ్ గా సినిమా రంగం అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్ కలిసి నిర్వహించే ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది అన్నది ప్రసిడెంట్ అనిల్ గారు తెలియచేస్తారు అన్నారు.

ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ .. తెలుగు సినిమా పరిశ్రమ అంటే హీరోలు, ఆడియో ఫంక్షన్లు , రిలీజ్ లు కాదు.. సినిమా పరిశ్రమ అంటే ఎంప్లాయిస్ ఫిలిం ఫెడరేషన్, దానికింద పనిచేస్తున్న 24 క్రాఫ్ట్స్, జూనియర్ ఆర్టిస్ట్, టెక్నీషియన్, లైట్ బాయ్.. ఇలా అందరు కలిసి పనిచేస్తేనే ఒక సినిమా వస్తుంది. దీని కింద చాలా మంది కార్మికులు ఉన్నారని చాలా మంది మరచిపోయారు. ఈ ఫిలిం ఫెడరేషన్ కొత్త కార్యవర్గం ఎన్నికైన తరువాత 24 క్రాఫ్ట్ వారిని కలుపుకుని ముందుకు సాగుతున్నాం. ఇక్కడ 24 క్రాఫ్ట్ కార్మికులం ఉన్నాం అంటూ మేడే వేడుకను అందరం కలిసి గ్రాండ్ గా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాం.

ఇంతకుముందు కూడా అనుకున్నాం కానీ కోవిద్ కారణంగా జరపలేదు .కానీ ఇప్పుడు 24 శాఖలకు సంబందించిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వం సహకారముతో కార్మికులకు మరిన్ని సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. మన కార్మికులకు మేడే దినోత్సవం ఉంటుంది.. దాన్ని సినిమా రంగంలో ఉన్న ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా మేడే జరుపుకుందాం. చెన్నై నుండి సినిమా పరిశ్రమ హైద్రాబాద్ వచ్చాకా కూడా కార్మికులందరూ ఐక్యతగా, ఒకే దగ్గర ఉంటున్నారో లేదో కూడా తెలియదు. కోవిద్ సమయంలో ఎంతమంది చనిపోయారో కూడా తెలియదు. మన కష్ట నష్టాలూ కూడా ప్రభుత్వాలకు తెలిసేలా చేయాలి, మన పరిశ్రమలో 24 వేల మంది కార్మికులు ఉన్నారు. మన దగ్గర సరిపోకపోతే పక్క రాష్ట్రాలనుండి తెచ్చుకుంటున్నాం.

మనదగ్గర చాలా కార్మిక శక్తి ఉంది. ఈ రోజు తెలుగు సినిమా, తెలుగు హీరోలంటే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే మన తెలుగు పరిశ్రమలోని ఫిల్మ్ల్ ఫెడరేషన్ అందరం కలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మిక దినోత్సవం జరుపుకుందాం. మన వర్కర్స్ లో ఔన్నత్యం పెరగాలి, ఐక్యత పెరగాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కార్మికులందరికి చాలా కష్ఠాలు ఉన్నాయి.. వాటిని ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ఈ పండగ ఉపయోగపడుతుంది. ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అథితిగా పాల్గొంటారు. అయన ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటాను, అందరితో కలిసి సహపంక్తి భోజనం చేసి వెళ్తాను అని అయన అన్నారు.

ఈ సందర్బంగా చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా కార్మికులకు అండగా ఉంటామని అన్నారు, ఇది మంచి కార్యక్రమం అని చెప్పడం. అలాగే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు, సినిమా పెద్దలు, హీరోలు, అలాగే అన్ని యూనియన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో సినిమా రంగంలో ఉన్న పలువురు ప్రముఖులను సన్మానించుకుందాం. కోవిడ్ సమయంలో ఎంతగానో కష్టపడ్డాం. ఆ సమయంలో సీసీసీ ద్వారా చిరంజీవిగారు ఆదుకున్నారు.. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒకరోజు 24 క్రాఫ్ట్స్ అందరికి స్వయంగా సహాయం అందించారు. అమితాబ్ గారి సహాయం, చదలవాడ శ్రీనివాస్ గారు అందించారు. వారందరిని కూడా సన్మానించుకుందాం.

ఫెడరేషన్ కొరకు కష్టపడ్డ పూర్వ లీడర్లు ను, యూనియన్ లు పటిష్టం కావడానికి కష్టపడ్డ వర్కర్స్ ని గౌరవించుకుందాం.. మమ్మల్ని చిన్నచూపు చూడొద్దని కోరుకుంటున్నాను. సినిమా రంగానికి ఫెడరేషన్ ద్వారా మేము ఎప్పుడు ముందుంటాం.. కార్మికుల కష్టాలను తీర్చేందుకు అనుక్షణం పనిచేస్తాం అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి ఎంతగానో అండగా ఉంటుంది. వారి సహకారంతో ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలని… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో కూడా ఫెడరేషన్ ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాను అన్నారు.

జనరల్ సెక్రటరీ దొరై మాట్లాడుతూ .. సినిమా రంగానికి సంబందించిన ఓ పెద్ద పండగ జరగాలి. ఈ కరోనా సమయంలో చాలా మంది కార్మికులు ఇబ్బందులు పడ్డారు. కొందరు ఇక్కడ బతకలేక ఊరు వెళ్లిపోయారు. అలా కష్టాలనుండి ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటపడుతున్నాం . సినిమా రంగంలో ఎలాంటి కష్ఠాలు వచ్చినా మనకు దేవుడిలాగా ఉండే దాసరి గారి లోటు కనిపిస్తుంది. అయన ఎక్కడున్నా మా కార్మికులకు అండగా ఉంటారు.. ఇప్పుడు కార్మికులకు అండగా ఉండేందుకు చిరంజీవిగారు సపోర్ట్ అందివ్వడం. కరోనా సమయంలో సీసీసీ ద్వారా ఎంతోమందికి సపోర్ట్ అందించారు . ఇప్పుడు సినిమా రంగంలోని 24 శాఖల ఆధ్వర్యంలో కలిసి గొప్పగా ఈ మేడే పండగను జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నానికి మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటున్నాను అన్నారు.

ట్రెజరర్ సురేష్ మాట్లాడుతూ .. ప్రస్తుతం కరోనా బిఫోర్.. కరోనా ఆఫ్టర్ అన్న విధంగా ప్రపంచం మారిపోయింది. ఇప్పుడిప్పుడే అందరు మళ్ళీ మంచి దశలోకి వస్తున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కరొనను దాటాం మనం అందరు. ఈ కరోనా సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. కరోనా సమయంలో నిత్యావసరాలు దొరకని పరిస్థితిలో చిరంజీవిగారు సీసీసీ ద్వారా నిత్యావసరాల సరుకులు అందించిన ఆయనకు సినిమా రంగ పెద్దలకు, తలసాని గారు కూడా ఎంతో సహకారం అందించారు. వారికీ మా ధన్యవాదాలు. కరోనా తరువాత పరిశ్రమ ఏదైనా పెద్ద పండగ అందరం కలిసి జరుపుకోవాలని ఈ ప్లాన్ చేసాం. తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం అన్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus