Chiranjeevi: రీమేక్స్ విషయంలో మెగాస్టార్ సంచలన నిర్ణయం.. వాళ్లకు శుభవార్తే కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటించగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ ఆశించిన ఫలితాలను అందుకోలేదు. ఓటీటీల కాలంలో రీమేక్ సినిమాలను ఎవరు చూస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భోళా శంకర్ మూవీ నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాలను మిగిల్చింది. అయితే చిరంజీవితో మరో సినిమాను నిర్మించి ఆ నష్టాలను భర్తీ చేయాలని అనిల్ సుంకర భావిస్తున్నారు.

అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి 156వ సినిమా సుస్మిత నిర్మాతగా తెరకెక్కుతుందని ప్రకటన వచ్చినా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కళ్యాణ్ కృష్ణ చిరంజీవితో బ్రో డాడీ రీమేక్ తెరకెక్కించాలని భావించగా భోళా శంకర్ ఫలితం ఆశించిన విధంగా లేకపోవడంతో కొంతకాలం పాటు రీమేక్ లకు దూరంగా ఉండాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

కళ్యాణ్ కృష్ణ మరో కొత్త కథతో చిరంజీవితో సినిమా తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. త్వరలో చిరంజీవి156 మూవీ డైరెక్టర్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చిరంజీవి కాలికి సంబంధించి చిన్న సర్జరీ జరిగిన నేపథ్యంలో కొంతకాలం పాటు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. చిరంజీవి త్వరలో తన సినిమాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పారితోషికం ప్రస్తుతం 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రాబోయే రోజుల్లో చిరంజీవి కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇతర భాషల్లో సైతం చిరంజీవి మరింత సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి స్టార్ డైరెక్టర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దర్శకుల విషయంలో చిరంజీవి నిర్ణయం ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. చిరంజీవి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus