Chiranjeevi: వాల్తేరు వీరయ్య మూవీకి అవే హైలెట్ కానున్నాయా?

చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రీఎంట్రీలో చిరంజీవి నటిస్తున్న స్ట్రెయిట్ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైందని ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని సమాచారం అందుతోంది. బాబీ ప్రముఖ యాక్టర్లతో పాటు చిరంజీవి కూడా పాల్గొనే సన్నివేశాలను షూట్ చేస్తున్నారని సమాచారం.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా మెగా అభిమానులకు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండనున్నాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లా మెగాస్టార్ కెరీర్ లో వాల్తేరు వీరయ్య బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న బాబీ ఈ సినిమాతో మరో కమర్షియల్ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్ముతున్నారు. వాల్తేరు వీరయ్య టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినా ఇదే ఫైనల్ టైటిల్ అని లీకుల ద్వారా క్లారిటీ వచ్చింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంజీవి స్టైల్, మాస్ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని సమాచారం అందుతోంది. చిరంజీవి ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చిరంజీవి ప్రతి సినిమాకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా బిజినెస్ జరుగుతోంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా చిరంజీవి సినిమాల బడ్జెట్లు కూడా పెరుగుతున్నాయి. చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు చిరంజీవి క్రేజ్, మార్కెట్ పెరుగుతుండటం గమనార్హం.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus