మెగాస్టార్ చిరంజీవి పారితోషికం ప్రస్తుతం 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. తనతో సినిమాలను నిర్మించిన నిర్మాతలకు నష్టం వస్తే ఆదుకునే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారు. భోళా శంకర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా ఈ సినిమాలో చిరంజీవి నటన మాత్రం అద్భుతంగా ఉందనే సంగతి తెలిసిందే. త్వరలో చిరంజీవి వరుస షూటింగ్ లతో బిజీ కానున్నారు, ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తైన తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
అయితే రాఖీ పండుగ సందర్భంగా చిరంజీవికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో చిరంజీవి చేతికి ఉన్న వాచ్ రేటెంతో తెలిసిన నెటిజన్ల మైండ్ బ్లాంక్ అవుతోంది. వాచ్ కోసం చిరంజీవి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. ఈ వాచ్ ఖరీదు మన దేశ కరెన్సీ ప్రకారం ఒక కోటీ 94 లక్షల 22 వేల రుపాయలు కావడం గమనార్హం. చిరంజీవి వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోవచ్చంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
మరి కొందరు జీవితాంతం కష్టపడినా (Chiranjeevi) చిరంజీవి వాచ్ ఖరీదు స్థాయిలో సంపాదించడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రోలెక్స్ కంపెనీకి చెందిన వాచ్ ను చిరంజీవి ధరించారు. చిరంజీవి ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు అని మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి. అయితే చిరంజీవి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక పడిన కష్టం మామూలు కష్టం కాదు.
చిరంజీవి రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి వయస్సు ప్రస్తుతం 68 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఈ వయస్సులో కూడా మెగాస్టార్ కష్టపడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!