ఇకపై ఎలా బ్రతకాలో తెలియడం లేదు.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి!

ఈమధ్య కాలంలో ఇండస్ట్రీకి సంబంధించిన వారు మరణిస్తూ ఇండస్ట్రీలో ఎంతో విషాదాన్ని నింపుతూ ఉన్నారు. అయితే సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా మరణించడంతో ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ ఇంట్లో జరిగినటువంటి విషాద ఘటనలను తెలియజేస్తూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు వారి కుటుంబ సభ్యులను కోల్పోయిన సంఘటనలను ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా లై, చల్ మోహన్ రంగా,డియర్ మేఘ వంటి సినిమాలలో నటిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మేఘ ఆకాష్ ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తాజాగా మేఘ ఆకాష్ అమ్మమ్మ మార్చి 1వ తేదీ మరణించినట్లు ఈమె ఈ పోస్టు ద్వారా తెలియజేశారు. మేఘ ఆకాష్ చేసిన ఈ పోస్ట్ కనుక చూస్తుంటే తన అమ్మమ్మతో ఈమెకు ఎలాంటి అనుబంధం ఉందో అర్థం అవుతుంది. ఈ సందర్భంగా తన అమ్మమ్మ గురించి మేఘ ఆకాష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ..

డియర్ అమ్మమ్మ నువ్వు వెళ్లిపోయావ్ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు. అయినా నేను నీలాంటి దాన్నే కాబట్టి ఎలాగైనా బ్రతికేస్తాను. అందరితో ఎంతో సరదాగా గడిపే నువ్వు అన్నివేళలా మమ్మల్ని నవ్వించడానికి మా అందరి ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేసే దానివి. నువ్వు మరణించిన తర్వాత ప్రతిరోజు నువ్వు మాతో పెట్టుకొనే ముచ్చట్లు గుర్తుకొస్తున్నాయి.ఇక ఆదివారం వచ్చిందంటే చాలు మీరు మాతో ఎంతో సరదాగా గడిపేవారు..

ఇకపై ఆదివారాలు అలా ఉండవు. ప్రస్తుతం మీరు భౌతికంగా మాతో లేకపోయినా ఎల్లప్పుడూ మాలోనే ఉంటారని..నీవు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తన అమ్మమ్మ పై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus