మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులందరికీ డ్యాన్స్ నేర్పించమని మెహబూబ్‌కు బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. దానికి మెహబూబ్ ఏదో కొన్ని స్టెప్పులు నేర్పించకుండా… కొత్తదనం ట్రై చేశాడు. ఇంట్లో ఎవరికి ఏ పనిబాగా అలవాటు, ఇంటి సభ్యుని పరిస్థితి, ఆలోచన విధానం బట్టి స్టెప్పులు కంపోజ్ చేశాడు.
వంట గదిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది కాబట్టి… లాస్యతో చపాతీ స్టెప్పులు వేయించాడు మెహబూబ్. చపాతి చేయడం, కాల్చడం లాంటి సంజ్ఞలతో ఈ స్టెప్పులు రూపొందించాడు. కాలు బెణికి ఇబ్బందిగా ఉన్న అవినాష్‌తో సింగిల్ లెగ్ స్టెప్పులు వేయించాడు. నేలపై కూర్చొని భలే వేయించాడు ఆ స్టెప్పులు. తన వర్కవుట్ పార్టనర్ అఖిల్‌తో వర్కవుట్ డ్యాన్స్ చేయించాడు. కార్లంటే బాగా ఇష్టం కాబట్టి అభిజీత్‌కు కారు స్టెప్పులు వేయించాడు. కారు డ్రైవ్ చేయడం, మూవ్ చేయడం లాంటి స్టెప్పులు వేశాడు అభిజీత్. ఇంట్లో ఏం జరిగిన ఠక్కున రెస్పాండ్ అయ్యే సోహైల్‌తో ఫ్రస్టేట్ డ్యాన్స్ వేయించాడు. కొంచెం తీన్మార్ స్టెప్పులకు దగ్గరగా ఫ్రస్టేషన్ చూపించేలా ఆ డ్యాన్స్‌ని తీర్చిదిద్దాడు.
రెట్రో డ్రెస్ వేసుకున్న కారణంగా ఆరియానాతో రెట్రో స్టయిల్‌లో స్లో మూమెంట్స్ స్టెప్ వేయించాడు. ఆఖరున పాత కాలం సినిమాల్లో చూపించే అడ్డు ముద్దు సీన్ కూడా చేశాడు. మాస్ స్టెప్పులకు పెట్టింది పేరు అమ్మ రాజశేఖర్. అతనితో కలసి కాంచన స్టయిల్ డ్యాన్స్ వేశాడు. ఇంట్లో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను అంటూ… కెప్టెన్ అయిపోయిన కుమార్‌సాయితో కన్‌ఫ్యూజన్ + క్లారిటీ డ్యాన్స్ చేయించాడు. ఇక ఆఖరిగా గంగవ్వతో ‘నీ కళ్లు నీలి సముద్రం పాట…’ పాటకు స్టెప్పులేయించాడు. మిగిలిన సభ్యులతో వేసిన డ్యాన్స్‌లు చూపించలేదు. అన్‌సీన్‌లో వాటిని వేస్తారేమో చూడాలి.