Chiranjeevi, Meher Ramesh: మెహర్‌ రమేశ్‌ సినిమా టైటిల్‌ ఇదే!

మెగా కుటుంబానికి కోల్‌కతాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అక్కడ ఆ హీరోలు చేసే సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘చూడాలని ఉంది’, ‘ఖుషీ’, ‘నాయక్‌’ లాంటి మంచి మంచి హిట్లే ఉన్నాయి. ఇల ఇప్పుడు ఈ కాంబినేషన్‌ను మరోసారి చూపించబోతున్నారు చిరంజీవి. అవును ఆయన కొత్త సినిమాల్లో ఒకటి కోల్‌కతా నేపథ్యంలోనే ఉండబోతోంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేదాళం’ రీమేక్‌ కోల్‌కతా నేపథ్యంలో రూపొందుతుంది. ‘వేదాళం’రీమేక్‌కు సంబంధించి చాలా రోజులుగా వార్తలొస్తున్నా,

చిరంజీవి అధికారికంగా ప్రకటించినా పూర్తి వివరాలు ఏవీ లేవు. అయితే చిరంజీవి జన్మదినం సందర్భంగా సినిమా టైటిల్‌ను ప్రకటించారు. దాంతోపాటు కాన్సెప్ట్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. సినిమా పేరు ‘భోళా శంకర్‌’. అది మీకు తెలిసే ఉంటుంది. ఇక ఆ పోస్టర్‌ చూస్తే… అందులో కోల్‌కతా నేపథ్యంలో క్లియర్‌గా తెలుస్తోంది. ఈ సినిమా అన్నాచెల్లళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందన్న విషయం తెలిసిందే. ‘లూసిఫర్‌’ రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ తర్వాత చిరంజీవి బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు.

దానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరు పెడతారని టాక్‌. కాన్సెప్ట్‌ పోస్టర్‌ కూడా అలానే ఉంది. ఆ తర్వాత ‘భోళా శంకర్‌’ వస్తుంది. 2022లో ఈ సినిమా విడుదల చేస్తామని చిత్రబృందం పోస్టర్‌లో ప్రకటించింది. అంటే చిరంజీవి నుండి వచ్చే ఏడాది కనీసం మూడు సినిమాలు చూడొచ్చన్నమాట.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus