ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘విక్రమార్కుడు’. 2006 వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్, అత్తిలి సత్తిబాబు అనే రెండు విభిన్నమైన పాత్రల్లో ఎంతో ఎనర్జిటిక్ గా నటించి మెప్పించాడు రవితేజ. ఇది పక్కన పెడితే.. ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో 2009 లో ‘బిల్లా’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. కానీ ఇంకా భారీ హిట్ అందుకుంటుంది అని మేకర్స్ ఆ టైంలో భావించారు. ఆ రేంజ్లో అయితే ‘బిల్లా’ సక్సెస్ కాలేదు కానీ.. నిర్మాతల్ని ఈ మూవీ గట్టెక్కించింది అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘విక్రమార్కుడు’ ‘బిల్లా’ సినిమాలకి ఓ లింక్ ఉందట. దర్శకుడు మెహర్ రమేష్ ఈ విషయాన్ని ‘భోళా శంకర్’ ప్రమోషన్స్ లో బయటపెట్టాడు. ‘డాన్’ సినిమాని అప్పటికే 5 సార్లు రీమేక్ చేయడం జరిగింది.
సీనియర్ ఎన్టీఆర్,అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అజిత్ వంటి హీరోలు డాన్ రీమేక్ లో నటించారు. అయితే అదే కథని ప్రభాస్ తో రీమేక్ చేయాలని మెహర్ రమేష్ అనుకున్నాడట. ఇదే విషయాన్ని అతను రాజమౌళికి చెబితే.. ‘ ఆల్రెడీ తెలిసిన కథని ఎలా చెబుతారు. అంత గట్ ఫీలింగ్ ఏంటి మీకు’ అని అడిగారట. అప్పుడు మెహర్ ‘నా మైండ్లో ‘డాన్’ రీమేక్ ని ఈ విధంగా చేయాలనుకుంటున్నాను.
మీ విక్రమార్కుడు స్టైల్ లో ఒకటి కామెడీ చేసే దొంగ క్యారెక్టర్.. (Meher Ramesh) అతను డాన్ అయ్యాక ఎలా ఉంటుంది. నేను ఇలాంటి సీన్లు అనుకుంటున్నాను’ అని రాజమౌళికి చెప్పాడట మెహర్. దీంతో రాజమౌళి కూడా ఇంప్రెస్ అయిపోయాడు. తర్వాత కొంత రషెస్ రాజమౌళికి చూపెడితే చాలా ఇంప్రెస్ అయ్యాడట. మెహర్ రమేష్ విజన్ కి ప్రశంసలు కురిపించాడట. అందుకే ‘బిల్లా’ ఆడియో లాంచ్ లో కూడా ‘ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ ఎందుకూ పనిచేయడు’ అనే అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!