Mehreen Pirzada: ఇంటర్వ్యూ : ‘స్పార్క్’ మూవీ గురించి మెహరీన్ చెప్పిన ఆసక్తికర విషయాలు.!

విక్రాంత్ హీరోగా ఎంట్రీ ఇస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహ‌రీన్, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ‘డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్’ బ్యాన‌ర్‌పై లీల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. న‌వంబ‌ర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మెహరీన్ పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీ కోసం :

ప్ర) స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మీరు.. కొత్త హీరోతో ‘స్పార్క్’ చేయడం ఎలాంటి ఫీలింగ్ ఇచ్చింది?

మెహరీన్ : నేను ముందుగానే చెప్పాను.! 2016 లో వచ్చిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ తోనే నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను. అప్పుడు ఓ స్టార్ హీరో అయిన నాని నాకు ఛాన్స్ ఇవ్వకపోతే.. ఇప్పుడు నేను ఎవరిని? ఎప్పుడూ ఏదో ఒక చోట ఎవరొకరు ఛాన్స్ ఇవ్వాల్సిందే.

ప్ర) ‘స్పార్క్’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

మెహరీన్ : జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటుంటారు. కన్న కలలు నిజం చేసుకోవాలి అనుకుంటారు. నేను కూడా అంతే. ఈ సినిమాలో నేను చేసిన లేఖ పాత్ర కూడా అలాగే ఉంటుంది. అందుకే నేను కనెక్ట్ అయ్యాను.

ప్ర) ‘స్పార్క్’ థీమ్ ఏంటి?

మెహరీన్ : యు.ఎస్‌లో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనలు ఆధారంగా చేసుకుని విక్రాంత్ ఈ కథను రెడీ చేసుకున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి థ్రిల్లర్ మూవీగా దీనిని రూపొందించారు.

ప్ర) కొత్త హీరో విక్రాంత్ తో పనిచేయడం ఎలా అనిపించింది?

మెహరీన్ : విక్రాంత్ అమెరికాలో బాగా సెటిల్ అయిన ఓ వ్యక్తి. అయితే సినిమాపై ఉన్న ప్యాషన్ తో ఇక్కడికి వచ్చారు. ముందు వేరే డైరెక్టర్ అనుకున్నారు. కానీ.. చివరకు విక్రాంత్ డైరెక్ట్ చేయడం జరిగింది. ఓ వైపు తొలిసారి హీరోగా చేస్తూనే మరోపక్క డైరెక్షన్ చేయడం అంటే ఛాలెంజింగ్ టాస్క్. కానీ విక్రాంత్ ఎంతో హార్డ్ వర్క్ చేసి దానిని సమర్థవంతంగా పూర్తి చేశారు.

ప్ర) కొంత ఇమేజ్ వచ్చాక హీరోయిన్లు.. కొత్త హీరోతో చేస్తున్నారు అంటే అది పారితోషికం కోసమే అని అంతా అనుకుంటారు.! దానికి మీరేమంటారు?

మెహరీన్ : బహుశా.. అది కొంతమంది చేస్తారేమో. కానీ నాకు ప్రతి సినిమా ప్రత్యేకమైనది. స్క్రిప్ట్, రోల్ నచ్చినప్పుడే ఓకే చేస్తాను. అది కెరీర్ పరంగానూ ఎంతో హెల్ప్ అవుతుంది. నన్ను ఇష్టపడేవారు, ప్రేక్షకులే! నాకు ఇన్‌స్పిరేషన్ వాళ్ళే. నటిగా నేను చేస్తున్న పాత్రకు 200 శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను.

ప్ర) ‘స్పార్క్’ లో కొత్త హీరో కాబట్టి.. మీ పాత్ర హీరోని డామినేట్ చేసే విధంగా ఉంటుందా?

మెహరీన్ : కథ మొత్తం నా పాత్రతోనే మొదలవుతుంది. తర్వాత హీరో రోల్ ఎంటర్ అవుతుంది. అతని పాత్ర చాలా ముఖ్యం. చివరికి నా పాత్రతోనే సినిమా ఎండ్ అవుతుంది.

ప్ర) ‘మహాలక్ష్మీ’ ‘హనీ’ ని మైమరిపించే విధంగా ఇందులో మీ పాత్ర ఉంటుందా?

మెహరీన్ : ఆ రెండు పాత్రల్లో మేనరిజమ్స్ ఉంటాయి. అది ప్రేక్షకులు ఊహించనిది. వాటిలా కాదు కానీ..’స్పార్క్’ లో కూడా నా పాత్ర బాగుంటుంది.

ప్ర) ‘స్పార్క్’ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి?

మెహరీన్ : ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. ఇలాంటి మంచి మ్యూజిక్ మా సినిమాకి పడుతుందని నేను ఊహించలేదు. హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ బాగున్నాయి.ఆయన సంగీతం అందించిన ‘ఖుషి'(2023) పాటలు కూడా నాకు బాగా ఇష్టం.

ప్ర) మీ 7 ఏళ్ళ సినీ కెరీర్లో మిస్ చేసుకున్న సినిమాలు ఏవైనా ఉన్నాయా?

మెహరీన్ : ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ తర్వాత నేను (Mehreen Pirzada) వరుసగా 6 ప్రాజెక్టులకు సైన్ చేశాను. ఆ టైంలో నాకు ‘తొలిప్రేమ’ ఆఫర్ వచ్చింది. బిజీగా ఉండటం వల్ల అలాంటి మంచి సినిమాలు మిస్ చేసుకున్నాను.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

మెహరీన్ : ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేశాను. అది కూడా థ్రిల్లర్ మూవీనే. వసంత్ రవి హీరోగా చేసిన మూవీ అది. ఆ సినిమా కూడా డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించినదే. కచ్చితంగా ఆ సినిమా కూడా అందరినీ మెప్పిస్తుంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus