టాలీవుడ్ లో ఈ ఏడాది పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల హవానే ఎక్కువ నడుస్తుంది. గత ఏడాది నుండి స్టార్ హీరోల సినిమాలు లేవు. భారీ బడ్జెట్ ముసుగులో వచ్చిన కొన్ని సినిమాలు బయ్యర్స్ కి కనీవినీ ఎరుగని నష్టాలతో చుక్కల్ని చూపించాయి. అలాంటి సమయం లో ఇండస్ట్రీ కి ఊపిరి పోస్తున్నది డబ్బింగ్ సినిమాలు మరియు చిన్న సినిమాలు. ఇప్పుడు ఆ కోవలోకే చేరింది ‘మేము ఫేమస్’ అనే మరో చిన్న సినిమా.
సుమంత్ ప్రభాస్ అనే నూతన హీరో దర్శకత్వం వహిస్తూ నటించిన (Mem Famous) ఈ చిత్రం రీసెంట్ గానే విడుదలై మూడు రోజుల్లో మూడు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. ముక్కు మొహం తెలియనోళ్లు సినిమా చేస్తే జనాలు ఇంత ఆదరిస్తున్నారంటే మేకర్స్ కంటెంట్ మీద ద్రుష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా మారిపోయిందంటే, సినిమా బాగుంటే గతం లో ఎలా అయితే ఎగబడి థియేటర్స్ కి వెళ్లి చూసేవాళ్ళో, బాగాలేదు అనే టాక్ వస్తే మాత్రం కనీసం థియేటర్స్ దరిదాపుల్లో కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
రీసెంట్ గా విడుదలైన కొన్ని బిగ్ బడ్జెట్ చిత్రాలకు ఇదే గతి పట్టింది. కనీసం వారం రోజులు కూడా థియేటర్స్ లో నిలబడలేకపోయాయి ఆ సినిమాలు. అలాంటి సినిమాలు వస్తున్న సమయం లో ‘మేము ఫేమస్’ అతి చిన్న సినిమాగా విడుదలై ఓవర్సీస్ లో కూడా లక్ష డాలర్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ఇది మామూలు విజయం కాదనే చెప్పాలి.
మౌత్ టాక్ కి ఉన్న పవర్ ముందు స్టార్ పవర్ ఏమాత్రం పనికి రాదు అని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. అమెరికా లో ఈ చిత్రం ఫుల్ రన్ లో రెండు లక్షల డాలర్స్ కి పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!