Mem Famous: జాతిరత్నాలు మ్యాజిక్ ను మేము ఫేమస్ రిపీట్ చేస్తుందా?

ఈ వారం థియేటర్లలో విడుదల కానున్న సినిమాలలో మేము ఫేమస్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్ సినిమాను నిర్మించిన బ్యానర్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి.

ప్రధానంగా చిన్న సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సవాలుగా మారింది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఆలోచనతో ఎంపిక చేసిన థియేటర్లలో మేము ఫేమస్ సినిమాను కేవలం 99 రూపాయలకే టికెట్ కొనుగోలు చేసి చూడవచ్చు. ప్రస్తుతం పెద్ద సినిమాల టికెట్ రేట్లతో పోల్చి చూస్తే ఈ మొత్తం చాలా తక్కువని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జాతిరత్నాలు తరహా కథాంశంతో తెరకెక్కిన మేము ఫేమస్ మూవీ ఆ సినిమా మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా (Mem Famous) అంచనాలను మించి విజయం సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు పోటీగా పలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాస్తవానికి మే నెలలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఈ వారం విడుదలవుతున్న సినిమాలు అయినా ఈ నెగిటివ్ సెంటిమెంట్లకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన మేము ఫేమస్ మూవీ అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుని హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. మేము ఫేమస్ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెరగడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉండే ఛాన్స్ అయితే ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus