ఎప్పుడైతే ‘మహానటి’ చిత్రంలో సావిత్రిగా నటించిందో అప్పటినుండీ ఆమెలానే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్. సావిత్రిగారు అప్పటిరోజుల్లోనే టాలీవుడ్ సూపర్ స్టార్లు ఎన్టీఆర్,ఏ.ఎన్.ఆర్ మాదిరే ఈమెకు క్రేజ్ ను సొంతం చేసుకుంది . అప్పట్లో సావిత్రి గారికి ఎలా అయితే మిగిలిన బాషల్లో వరుస అవకాశాలు వచ్చేవో.. కీర్తి సురేష్ కూడా అదే విధంగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతుంది.
ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీని కీర్తి సురేష్ కుటుంబం కలవడంతో.. కీర్తి రాజకీయాల్లోకి వస్తుందనే ప్రచారం జోరందుకుంది. దీంతో కీర్తి అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్తుందనే కామెంట్లు కూడా మొదలయ్యాయి. దీంతో… వార్తలకి చెక్ పెడుతూ కీర్తి తల్లి మేనకా సురేశ్ క్లారిటీ ఇచ్చింది. కీర్తి సురేశ్ రాజకీయాల్లోకి ఇప్పట్లో రావట్లదని తేల్చి చెప్పేసింది.ఇప్పటికే కీర్తి సురేష్ తండ్రి సురేష్ ఆల్‌రెడీ బీజేపీలో ఉన్నారు. అయితే వీరు మొదటి నుండీ బీజేపీ పార్టీ కి సానుభూతి పరులమని.. ఒకవేళ ప్రచారం చేయాల్సి వస్తే చేస్తాం తప్ప ఇప్పట్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది కీర్తి తల్లి. గతంలో కూడా సినిమా వాళ్ళు అందరూ ప్రధాని మోదీని కలిశారని.. ఆ సమయంలోనే మేము కూడా వెళ్లామని.. ప్రత్యేకంగా మేం ఒక్కరేమే వెళ్లలేదని చెప్పుకొచ్చింది.