Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » మెర్క్యూరీ

మెర్క్యూరీ

  • April 13, 2018 / 07:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెర్క్యూరీ

కమల్ హాసన్-అమల జంటగా 1987లో వచ్చిన “పుష్పక్” అనంతరం సౌత్ ఇండియాలో దాదాపు 30 ఏళ్ల అనంతరం వచ్చిన మూకీ చిత్రం “మెర్క్యూరీ”. టాలెంటెడ్ డైరెక్టర్ కీర్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభుదేవ తన కెరీర్ లో మొదటిసారిగా నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ పోషించడం విశేషం. మూకీ చిత్రం కావడంతో అన్నీ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!mercury-1

కథ : పాండిచ్చేరిలో మెర్క్యూరీ పాయిజనింగ్ కరణంగా 1992లో జరిగిన ఓ దుర్ఘటన కారణంగా 84 మంది మరణిస్తారు. ఆ కెమికల్ ఎఫెక్ట్ కారణంగా భవిష్యత్ తరాలు కూడా పలు రకాల ఫిజికల్ ఇంపెయిర్ మెంట్స్ తో బాధపడాల్సి వస్తుంది. అలా ఆ ఊరికి చెందిన చాలా మందిలో కొందరికి చెవులు, ఇంకొందరికి కళ్ళు, మరికొంతమందికి మాట పోతాయి. అలా ఒకే ఊరిలోని పాఠశాలలో చదువుకొన్న విద్యార్ధుల బ్యాచ్ లో అయిదుగురు (సనంత్ రెడ్డి, దీపక్ పరమేష్, శశాంక్, అనీష్, ఇందుజ) దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుసుకొంటారు.

సరదాగా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో వీరి జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. అప్పుడు వాళ్ళ జీవితాల్లోకి ఎంటరవుతాడు ప్రభుదేవ. వీళ్ళందరి పాలిట యమధర్మరాజులా మారతాడు. అసలు ప్రభుదేవ వీళ్ళ జీవితాల్లోకి ఎందుకు వచ్చాడు? అతడి కారణంగా వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన మార్పులేమిటి? అనేది “మెర్క్యూరీ” కథాంశం.mercury-2

నటీనటుల పనితీరు : ఒక్క ప్రబుదేవ మినహా నటీనటులందరూ కొత్తవారు, తమిళవారు కావడంతో వారి పాత్రలకు మన తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం అనేది కష్టం. అయితే.. వాళ్ళు కూడా ఓపెనింగ్ సీన్స్ లో చెవిటి-మూగవారిగా సరైన హావభావాలు పలికించలేకపోయారు. ముఖ్యంగా.. ఆడియన్స్ మీద ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన యాక్సిడెంట్ సీన్ వారి పేలవమైన నటన కారణంగా తేలిపోయింది. ప్రభుదేవ ఈ చిత్రంలో నటుడిగా ఆశ్చర్యానికి గురి చేస్తాడు. నెగిటివ్ షేడ్ రోల్ లో ప్రభుదేవ నటన, అతడి ఆహార్యం అమితంగా ఆకట్టుకుంటుంది. మ్యానరిజమ్స్ పరంగా ఆంగ్ల చిత్రం “డోన్ట్ బ్రీత్”లోని కీలకపాత్రధారుడిని గుర్తుకు తెచ్చినప్పటికీ.. తన మార్క్ వేయగలిగాడు.mercury-5

సాంకేతికవర్గం పనితీరు : సంతోష్ నారాయణ్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ కంటే.. మిథూన్ సౌండ్ డిజైనింగ్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. ముఖ్యంగా ప్రభుదేవ క్యారెక్టరైజేషన్ ను ఎస్టాబ్లిష్ చేసేప్పుడు చేసిన సౌండ్ డిజైన్ థియేటర్ లో అప్పటివరకూ సైలెంట్ గా కూర్చున్న ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. తిరు సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్రేమింగ్స్, లాంగ్ షాట్స్, ఫ్లిప్ షాట్స్ భలే ఆకట్టుకొంటాయి. కలర్ గ్రేడింగ్, లైటింగ్ మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ బ్రిలియన్స్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఫస్టాఫ్ చాలా పేలవంగా సాగుతుంది అనుకొంటున్న తరుణంలో వచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్, ఆ తర్వాత ప్రభుదేవ టిపికల్ క్యారెక్టరైజేషన్ & ఎబిలిటీస్ ను బేస్ చేసుకొని రాసుకొన్న స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొంటాయి. ముఖ్యంగా.. క్లైమాక్స్ ఎండింగ్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్స్ ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ సెటిమెంట్ & ఎమోషనల్ టచ్ ఇవ్వడం అనేది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ఒక దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్నప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా వైవిధ్యమైన కథ-కథనాలతో “మెర్క్యూరీ” చిత్రాన్ని తెరకెక్కించడమే కాక భావితరాలకు మంచి మెసేజ్ ఇవ్వడం అనేది అభినందనీయం.mercury-4

విశ్లేషణ : “మెర్క్యూరీ” అనేది రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు. అందువల్ల ఏదో ఎక్స్ పెక్ట్ చేసి పొరపాటున కూడా థియేటర్ కి వెళ్ళకండి. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం మాత్రమే ఈ చిత్రాన్ని చూడండి. ప్రభుదేవ నటన, ప్రీక్లైమాక్స్ ఎమోషనల్ టచ్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే అంశాలు.

రేటింగ్ : ఇది ప్రయోగాత్మక చిత్రం గనుక రేటింగ్ ఇవ్వడం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anish Padmanabhan
  • #Deepak Paramesh
  • #Gajaraj
  • #Indhuja
  • #Karthik Subbaraj

Also Read

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

related news

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jigris Review in Telugu: జిగ్రీస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

1 hour ago
Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

2 hours ago
Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

2 hours ago
Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

3 hours ago
Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

18 hours ago

latest news

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

10 mins ago
Kriti Sanon: కాజోల్‌కే కాదు కృతి సనన్‌కి కూడా అదే అనుభవం.. మరోసారి వీడియో వైరల్‌

Kriti Sanon: కాజోల్‌కే కాదు కృతి సనన్‌కి కూడా అదే అనుభవం.. మరోసారి వీడియో వైరల్‌

22 mins ago
Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

1 hour ago
Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎంత ముద్దుగా చెప్పిందో టాలీవుడ్‌ ఊతపదం

Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎంత ముద్దుగా చెప్పిందో టాలీవుడ్‌ ఊతపదం

1 hour ago
VARANASI: రాజమౌళి టార్గెట్.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా?

VARANASI: రాజమౌళి టార్గెట్.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version