Game Changer: అలా అయితే ‘గేమ్ ఛేంజర్’ కి పెద్ద దెబ్బ పడినట్లే..!

‘గేమ్ ఛేంజర్’ (Game Changer) .. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా. పాన్ ఇండియా సినిమా. 5 ఏళ్ల తర్వాత రాంచరణ్ (Ram Charan) సోలో హీరోగా రూపొందిన సినిమా. కోలీవుడ్ స్టార్ దర్శకుడు శంకర్ తెలుగులో తీసిన మొదటి సినిమా. నిర్మాత దిల్ రాజు  (Dil Raju)  కెరీర్లో ఇది 50వ సినిమా. ఇలా చెప్పుకుంటే పోతే దీనికి చాలా విశిష్టతలు ఉన్నాయి. అందుకే దీన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించడం లేదు అనేది ఇన్సైడ్ టాక్.

Game Changer

ఎందుకంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి టికెట్ హైక్స్ దక్కే అవకాశం లేదట. ఒకవేళ వచ్చినా అంతంత మాత్రమే అని అంటున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి లభించే అవకాశం కనిపించడం లేదు. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా టైంలో జరిగిన తొక్కిసలాట ఘటనని ఆధారం చేసుకుని.. తెలంగాణ ప్రభుత్వం ‘గేమ్ ఛేంజర్’ సినిమా స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వలేదు. కనీసం మిడ్ నైట్ షోలకి కూడా అనుమతులు ఇవ్వడం లేదు అని ఇన్సైడ్ టాక్.

సో స్పెషల్ షోలు, టికెట్ హైక్స్ వంటివి లేకపోతే.. ‘గేమ్ ఛేంజర్’ వంటి పాన్ ఇండియా సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం లేదు. అందుకే దిల్ రాజు అండ్ టీం ఈ విషయంపై తర్జనభర్జనలవుతున్నటు తెలుస్తోంది. ఎఫ్.డి.సి చైర్మన్ కాబట్టి.. ఈ విషయం పై దిల్ రాజు తెగ ప్రయత్నిస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది. ఆయన ప్రయత్నాలు ఈ రాత్రికి ఒక కొలిక్కి వస్తే.. ‘బుక్ మై షో’ వంటి వాటిలో బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది.

తమన్ ఇలా అనేశాడేంటి?.. వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus