ఎన్నికల్లో ప్రజలు ఎవర్ని, ఏ రకంగా ఎన్నుకొంటారు అనేది ఎవరికీ అర్ధం కాని విషయం. వాళ్ళు ఒక నాయకుడిలో ఏం చూస్తారు అనేది ఎప్పుడు గెస్ చేయలేం. ఒక్కోసారి రౌడీ షీటర్ ను ఎన్నుకొంటారు, ఇంకోసారి నిఖార్సైన వ్యక్తిని ఒడిస్తారు. ఓటర్ నాడి అనేది ప్రపంచస్థాయి విశ్లేషకులకు కూడా అర్ధం కాలేదు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చాలామంది పోటీ చేశారు, కొందరు ఓడారు, ఇంకొందరు గెలిచారు. కానీ.. అందరి కంటే ఎక్కువగా జనాలని ఆశ్చర్యానికి గురి చేసింది మాత్రం బెంగాల్ కి చెందిన నుస్రత్ జహాన్ మరియు మిమి చక్రబోర్తిలు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్ధులుగా ఎం.పీ స్థానానికి పోటీ చేసిన ఈ ఇద్దరు అందాల భామలు విశేషమైన మెజారటీతో గెలిచారు.
ఆల్రెడీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కి ట్రోల్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ అందాల భామలు కేవలం ఎంపీలుగా మాత్రమే కంటిన్యూ అవుతారా లేక సినిమాలు కూడా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుటానికి నెటిజన్లు మాత్రం హ్యాపీగా వాళ్ళను ఉద్దేశించి అసెంబ్లీ ఫుల్ అటెండెన్స్ ఉంటుందని, వాళ్ళను చూడడం కోసం పొలిటీషియన్స్ ఎగబడతారని కామెంట్స్ మొదలెట్టారు.