టాలీవుడ్ హీరో నాని తిమ్మరుసు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ థియేటర్లపై రాష్ట్ర ప్రభుత్వాల చిన్నచూపు గురించి, టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వాల జోక్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని ప్రధానంగా ఏపీలో టికెట్ రేట్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ కామెంట్లు చేయగా ఏపీ మంత్రులు నాని విమర్శల గురించి స్పందించడానికి ఇష్టపడలేదు. అయితే తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాని విమర్శల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సర్కార్ నుంచి థియేటర్ల విషయంలో ఎటువంటి అడ్డంకులు లేవని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పార్కింగ్ ఫీజులు వసూలు చేయమని చెప్పామని మంత్రి చెప్పుకొచ్చారు. కానీ ఇంకా థియేటర్లు తెరవలేదని అందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కారణమా..? అని ప్రశ్నించారు. నిర్మాతలు సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపకపోతే ఏం చేయగలమని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఈరోజు కొన్ని సినిమాలు రిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నా తక్కువ సంఖ్యలో థియేటర్లను మాత్రమే తెరిచారు.
ఏపీలోని థియేటర్లలో తక్కువ రేటుకే సినిమా టికెట్లు అమ్ముతుండటంతో నిర్మాతలకు సినిమా హిట్టైనా భారీగా లాభాలు వచ్చే అవకాశం అయితే లేదు. ఇష్క్, తిమ్మరుసు సినిమాల ఫలితాలను, కలెక్షన్లను బట్టి మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించిన ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. పెద్ద సినిమాలు రిలీజైతే మాత్రమే థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకునే ఛాన్స్ ఉంది.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!