‘హనుమాన్’ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ఇప్పుడు ‘మిరాయ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ, జగపతి బాబు, జయరామ్ వంటి స్టార్స్ నటించగా మంచు మనోజ్ విలన్ రోల్ పోషించాడు. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తొలిరోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి.
2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 7.4 cr |
సీడెడ్ | 1.65 cr |
ఉత్తరాంధ్ర | 1.45 cr |
ఈస్ట్ | 1.15 cr |
వెస్ట్ | 0.65 cr |
గుంటూరు | 1.02 cr |
కృష్ణా | 0.98 cr |
నెల్లూరు | 0.37 cr |
ఏపీ+తెలంగాణ(టోటల్) | 14.67 cr(షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా + హిందీ | 3.65 cr |
ఓవర్సీస్ | 5.95 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 24.27 cr(షేర్) |
‘మిరాయ్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లోనే ఈ సినిమా రూ.24.27 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.4.23 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం కలెక్షన్స్ తో ‘మిరాయ్’ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.