‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జ హీరోగా రూపొందిన మరో పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత వారం అంటే సెప్టెంబర్ 12న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. వీక్ డేస్ లో కొంత డౌన్ అయినప్పటికీ.. స్టడీగానే కలెక్ట్ చేస్తూ బయ్యర్స్ కి లాభాలు పంచుతుంది. సినిమాలో మంచు మనోజ్ విలనిజం, విజువల్ ఎఫెక్ట్స్ వంటివి ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అందువల్ల థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.దీంతో బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కి ఆదరణ లభిస్తుంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
16.5 cr
సీడెడ్
3.80 cr
ఉత్తరాంధ్ర
3.42 cr
ఈస్ట్
2.07 cr
వెస్ట్
1.23 cr
గుంటూరు
1.82 cr
కృష్ణా
1.81 cr
నెల్లూరు
0.98 cr
ఏపీ+తెలంగాణ(టోటల్)
31.63 cr(షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + హిందీ
6.08 cr
ఓవర్సీస్
11.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
48.79 cr(షేర్)
‘మిరాయ్’ (Mirai) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 7 రోజుల్లో ఏకంగా రూ.48.79 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.20.29 కోట్ల లాభాలు అందించింది.