ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది నటీమణులు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను.. ఆవేదనతో వ్యక్తం చేశారు. అయితే ‘ఇవి అన్ని పరిశ్రమల్లోనూ ఉంటాయి. కానీ సినిమా పరిశ్రమలోనే ఎక్కువ ఉన్నట్టు అంతా చెబుతారు’ అని ఇంకొంతమంది చెబుతుంటారు. సీనియర్ నటి మిర్చి మాధవి కూడా ఈ విషయాలపై ఓపెన్ గానే మాట్లాడింది.

Mirchi Madhavi

‘ఒంటరి’ ‘100% లవ్’ ‘మిర్చి’ ‘ఎవడు’ వంటి పెద్ద సినిమాల్లో నటించింది. ‘మిర్చి’ సినిమాతో ఈమెకు మంచి పాపులారిటీ లభించింది.మొత్తంగా ఆమె 300 కి పైగా సినిమాల్లో నటించారు. అంతకు ముందు దాదాపు 20 సీరియల్స్ లో నటించింది. సినిమాల్లో ఛాన్సులు వచ్చిన తర్వాత సీరియల్స్ లో నటించడానికి మంచి నటీమణులు ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈమె ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తున్నారు.

‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అవుతున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అనే సీరియల్లో నెగిటివ్ రోల్ చేస్తుంది.ఇదిలా ఉంటే.. ఈమె యంగ్ ఏజ్ లోనే కెరీర్ ప్రారంభించారు. కెరీర్ ప్రారంభంలో ఈమెకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పి షాక్ ఇచ్చింది. అయితే కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ అని చెప్పుకునే వ్యక్తి ఈమె ఇంటికి వచ్చి చాలా వల్గర్ గా ప్రవర్తించాడట. శారీ కట్టుకుని వచ్చి..నడుము చూపించమని అడిగాడట.

వెంటనే ఈమె ‘చెప్పు తెగుద్ది’ అని చెప్పి బయటకు పొమ్మని చెప్పిందట. తర్వాత ఒక సినిమా కోసం ఈమెకు ఫోన్ చేశారట.తమ సినిమాలో ప్రకాష్ రాజ్ భార్య పాత్ర ఒకటి ఉందని.. కానీ అది కావాలంటే 5 మందితో పడుకోవాలని(కాంప్రమైజ్) కావాలని చెప్పారట. అందుకు మిర్చి మాధవి ఒప్పుకోలేదట. ‘అలాంటి పనులు చేసుకునే ఉద్దేశం ఉంటే.. అదే చేసుకునే దాన్ని.. డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి.. కానీ అలాంటి ఉద్దేశాలు నాకు లేవు’ అని తెగేసి చెప్పేసిందట. ఆమె కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus