Ram Charan: రామ్ చరణ్ కోసం.. మీర్జాపూర్ మున్నా?

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC16 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపికైన ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించగా, మైసూర్‌లో తొలి షెడ్యూల్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బచ్చిబాబు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకొని, తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో నటించబోతున్నవారి పేర్లతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

Ram Charan

కన్నడ స్టార్ శివ రాజకుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబులు కీలక పాత్రల్లో నటించనున్నారు. తాజాగా, మీర్జాపూర్ సిరీస్‌ ఫేమ్ దివ్యేందు RC16 లో ఎంట్రీ ఇస్తున్నట్లు నెట్టింట హల్‌చల్ అవుతోంది. మీర్జాపూర్‌ సిరీస్‌లో మున్నా భాయ్‌గా దివ్యేందు తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ పాత్రతో ఆయనకు విశేషమైన పాపులారిటీ రావడంతో, ఇప్పుడు RC16 లో నటించనున్నారన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఇప్పటి వరకు దివ్యేందు తెలుగు చిత్రాల్లో నటించకపోయినప్పటికీ, ఈ పాత్రతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తారన్న టాక్ ఉంది. కీలకమైన పాత్ర కోసం అతన్ని తీసుకున్నారని, అది కథలో ప్రధాన మలుపుగా ఉండబోతోందని సమాచారం. మరి మేకర్స్ అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారన్నది చూడాలి. దివ్యేందు రాబోవు చిత్రంలో భాగమవుతారని తెలియడంతో, రామ్ చరణ్ ఫ్యాన్స్ మరో లెవల్‌లో ఎగ్జైటెడ్‌ అవుతున్నారు.

RC16 నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు కొత్తగా స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారని, ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కోసం రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారని, ఆయన పాత్ర అభిమానులకు పెద్ద ట్రీట్‌గా మారుతుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus