Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన భార్య!

టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ అందరికీ సుపరిచితమే. గతంలో ‘ఆది’ ‘లక్ష్మీ నరసింహ’ ‘కాంచన’ ‘కందిరీగ’ వంటి హిట్ సినిమాలను నిర్మించారు. తర్వాత ఆయన కొడుకులు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్దకొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. సాయి గణేష్ అయితే ‘స్వాతిముత్యం’ ‘నేను స్టూడెంట్ సార్’ అనే సినిమాల్లో నటించాడు. అతను ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగినట్టు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నిర్మాత (Bellamkonda Suresh) బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. కొంత నగదు, కొన్ని మద్యం సీసాలు దొంగలెత్తుకెళ్లారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని బెల్లంకొండ సురేష్ కి ‘సాయి గణేష్ ప్రొడక్షన్స్’ పేరుతో ఓ ఆఫీస్ ఉంది. నిన్న అంటే జూన్ 9 న సురేష్ తన బెంజ్ కారుని ఆఫీస్ ముందు పార్క్ చేశారు. ఈరోజు ఉదయం ఆ కారుని చూస్తే వెనుక సీట్ వద్ద అద్దం పగిలి ఉందట.

కారు లోపల పెట్టిన రూ.50 వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలు కనిపించలేదు. ఒక్కో మధ్య సీసా ఖరీదు దాదాపు రూ.28 వేల వరకు ఉంటుందట. దీంతో బెల్లంకొండ సురేష్ భార్య పద్మావతి గారు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.వారి కంప్లైంట్ ను సవీకరించి.. డిఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus