జూనియర్ ఎన్ టి ఆర్ అభిమానుల ద్వారా  5 కుటుంబాలను ఆదుకున్న ‘బిగ్ బాస్’ మిత్రా శర్మ

కుర్నూల్ జిల్లాలోని ఎన్ టి ఆర్ నగర్ లో ఈ నెల 1వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదం లో సర్వం కోల్పోయిన 5 గుడిసె వాసులకు నిత్యవసర వస్తువులతో పాటు దుస్తులను బిగ్ బాస్ మిత్రా శర్మా అందించడం అభినంధనీయమని, నందమూరి అభిమానుల సంగం నాయకుడు కోట్ల తిమ్మారెడ్డి అన్నారు, ఈ మేరకు ఎన్టిఆర్ నగర్ లో అగ్ని ప్రమాదంలో గుడిసెలు కోల్పోయిన వారికి నిత్యవసర వస్తువులను,దుస్తులను అందచేశారు.

Click Here To Watch NOW

కుర్నూల్ నగరంలోని 41వ వార్డ్ పరిధిలోని ఎన్టిఆర్ నగర్ లో, ఈ నెల 1వ తేదీన సిలిండర్ పేలిన ఘటనలో కాలిపోయిన 5 గుడిసెల నిర్వాచితులకు బిగ్ బాస్ షో మిత్రాశర్మా సౌజన్యంతో, నందమూరి వంశాభిమానుల ఆద్వర్యం లో నిత్యవసర వస్తువులు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి వంశాభిమానుల తరపున కోట్ల తిమ్మారెడ్డి, మిత్రాశర్మ తరపున రాజు తదితరులు పాల్గున్నారు. ఈ సందర్భం గా 5 గుడిసెల వాసులకు, ఒక్కొక్కరికి 25కేజిల బియ్యం తో పాటు నిత్యవసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భం గా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఏప్రిల్ 1వ తేదీన ఒక ఇంట్లో సిలిండర్ పేలిన ఘటనకు సంబంధించి మొత్తం 5 గుడెసలు ధగ్ధమయ్యాయని చెప్పారు. తెల్లవారితే ఉగాది పండుగ ఉన్న నేపధ్యంలో వారు తెచ్చుకున్న సరుకులతో పాటు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కాలిపోయి, కట్టు బట్టలతో గుడిసెవాసులు మిగిలిపోయారు అని ఆవేధం వ్యక్తం చేశారు. వీరి పరిస్థితులు గమనించి నందమూరి వంశాభిమానుల తరపున, బిగ్ బాస్ షో మిత్రాశర్మకు వినతి పంపగా ఆమే వెంటనే స్పందించి నిత్యవసర వస్తువులనూ, బట్టలను బాధితులకి అందచేశారు అని చెప్పారు.

ఈ సంధార్బంగా మిత్రాశర్మకు ధన్యవధాలు తెలిపారు. ఈ సందర్భం లో మిత్త్రాశర్మ తరపున రాజు మాట్లాడుతూ, ఈ దుర్ఘటన చాలా బాధకారమైనధి, ప్రతీఒక్కరు ఈ 5 కుటుంబాలకు తమవంతు సహాయం చేయాలని కోరారు, ఈ కుటుంబాల యొక్క గూగుల్ పే నెంబర్ కి మన వంతు మనం సహాయం చేద్ధం అంటూ తెలిపారు. అలాగే మిత్రాశర్మ చాలా మందికి సహాయం చేశారని, ఇచ్చే చేయికి తెలియకుండ సహాయం చేయాలి అనేది తన ఫిలాసఫి అంటూ తెలిపారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus