Bigg Boss Telugu OTT: మిత్రా చేసిన పనివల్లే టాస్క్ ఓడిపోయిన ఛాలెంజర్స్..!

బిగ్ బాస్ హౌస్ లో ఛాలెంజర్స్ వర్సెస్ వారియర్స్ మద్యలో టాస్క్ గట్టిగానే నడుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ ఛాలెంజర్స్ ఆధీనంలో ఉంచాడు బిగ్ బాస్. తిండి తినాలన్నా, బెడ్స్ పై పడుకోవాలన్నా, వారికి కావాల్సిన బట్టలు తీస్కోవాలన్నా కూడా ఛాలెంజర్స్ ని అడుక్కునే పరిస్థితి వచ్చింది వారియర్స్ కి. దీంతో ఛాలెంజర్స్ రూల్స్ ని పాటిస్తూ టాస్క్ ని ముందుకు తీస్కుని వెళ్తున్నారు. ఇందులో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.

దీనికి ఛాలెంజర్స్ టీమ్ లో ఛైతూని లీడర్ గా పెడితే, వారియర్స్ టీమ్ లో నటరాజ్ మాస్టర్ ని టీమ్ లీడర్ గా పెట్టాడు. అంతేకాదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఇరు టీమ్స్ ఒకరినొకరు దమ్ముంటే చేసి చూపించూ అంటూ ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం టాస్క్ ని బట్టీ బిడ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఎవరి కెపాసిటీ , దమ్ము ఎంతో వారు తేల్చుకోవాలి. ఫస్ట్ టాస్క్ లో భాగంగా స్మిమ్మింగ్ పూల్ లో చేపలా ఊపిరి పీల్చాల్సి ఉంటుంది.

వాటర్ లో తేలియాడుతూ పూల్ లో ఉన్న కుర్చీలో కూర్చుని పైప్ సహాయంతో ఊపిరి పీల్చుకోవాలి. ఈ టాస్క్ లో ఆడేందుకు అఖిల్ ని సీనియర్ జట్టు ఎంచుకుంది. అలాగే, జూనియర్స్ నుంచీ మిత్రా శర్మాని ఎంచుకున్నారు. సీనియర్స్ చాలా లెక్కలు వేసిన తర్వాత బిడ్ లో పాల్గొన్నారు. అఖిల్ 30 సెకన్స్ బిడ్ వేస్తే, మిత్రాశర్మా ఏకంగా 5నిమిషాలు చెప్పేసింది. దీనికి షాక్ అయిన అఖిల్ దమ్ముంటే చేయి అంటూ ఛాలెంజ్ చేసాడు.

ఇక పూల్ లోకి దిగిన మిత్రాశర్మ కాసేపు కూడా ఉండలేకపోయింది. అత్సుత్సాహంతో , ఓవర్ యాక్షన్ తో ముందుకు దిగిన మిత్రా టాస్క్ లో ఓడిపోయింది. అవగాహన లేకుండా సమయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయారు జూనియర్స్. ఇక మిత్రా ఉత్సాహం వల్లే టాస్క్ ని ఓడిపోవాల్సి వచ్చింది. ఈ టాస్క్ లో ఒక పాయింట్ సాధించిన సీనియర్ జట్టు ముందంజలో ఉంది. అదీ మేటర్.

[yop_poll id=”9″]

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus