Mahesh Babu: మహేష్ సినిమా కథ.. కరెన్సీతో హింట్ ఇస్తున్నారా?

Advertisement

దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి కూడా గతంలో రెండు మూడు సార్లు మహేష్ తో సినిమా చేయాలి అనుకుని మళ్లీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు RRR సినిమా అనంతరం మహేష్ బాబు సినిమా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు.

ఆ సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సమకూరుస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. ఆ సినిమా ఆఫ్రికా అడవులు నేపథ్యంలో ఉంటుందని కూడా అన్నారు. అయితే ఇంకా రాజమౌళి ఫైనల్ చేయలేదు అని రాజమౌళి ఓకే చేస్తేనే ప్రాజెక్టు మొదలవుతుందని కూడా ఆయన అన్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

విజయేంద్రప్రసాద్ సోదరుడి కూతురు అయిన ఎం ఎం శ్రీలేఖ ఇన్స్టాగ్రామ్ లో ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెట్టారు. ఆమె కూడా చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తన పెదనాన్న తో ఒక ప్రత్యేకమైన ఫోటో షేర్ చేసుకుంటూ రాబోయే మహేష్ బాబు రాజమౌళి సినిమాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఆ ఫోటోలో విజయేంద్రప్రసాద్ టేబుల్ ముందు కథ రాసుకుంటూ కూర్చుని వున్నట్లుగా ఉండగా ముందు కరెన్సీ నోట్లు ఉండడం విశేషం.

సాధారణంగా రచయితలు వారికి ఒక అనుభూతి రావాలి అని ఏదో ఒక విధమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంతే అంతేకాకుండా కొన్నిసార్లు ఎవరికీ అర్థం కాని విధంగా హింట్స్ కూడా ఇస్తూ ఉంటారు. బహుశా మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించి అదే తరహాలో విజయేంద్రప్రసాద్ ఈ విధంగా నోట్లతో ఏమైనా హింట్ చేస్తున్నారేమో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags