విడాకులు ప్రకటించిన ‘మొగలిరేకులు’ నటి.!

ఈ మధ్య సినీ సెలబ్రిటీల విడాకుల మేటర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్,హీరో అయిన జీవీ ప్రకాష్ కుమార్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. 11 ఏళ్ళ వివాహ బంధానికి ఈ దంపతులు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇంతలోనే మరో నటి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. బుల్లితెర నటి శిరీష తన భర్త నుండి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు.

‘మొగలిరేకులు’ సీరియల్ లో ధర్మ కూతురు సింధుగా ఈమె మంచి నటన కనపరిచింది. ఆ తర్వాత ‘స్వాతి చినుకులు’ ‘రాములమ్మ’ ‘మనసు మమత’ ‘కాంచన గంగ’, ‘నాతిచరామి’ వంటి సీరియల్స్ తో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘చెల్లెలి కాపురం’ సీరియల్ శిరీష కెరీర్ మంచి బూస్టప్ ఇచ్చింది అని చెప్పాలి. ఇందులో భూమి పాత్రలో చాలా బాగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ లో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈమె తన భర్త నవీన్ వల్లభనేనితో విడాకులు తీసుకోబోతుండటం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయ్యింది.ఈ జంటకు శ్రీ ఈష్ అనే బాబు ఉన్నాడు. ఈ జంట చాలా షోస్ లో సందడి చేయడం జరిగింది. కానీ ఇంతలో ఏం జరిగిందో వీళ్ళు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ‘మా నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము’ అంటూ శిరీష తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus