Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.  అతని సినిమాలు వెయ్యి కోట్ల బిజినెస్ ఈజీగా చేసేస్తున్నాయి. పారితోషికం విషయంలో కూడా ఏ హీరోకి అందని రేంజ్లో ప్రభాస్ ఉన్నాడు. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ప్రభాస్ ది..! చెప్పుకోవడానికి ఇన్ని మంచి ఉన్నప్పటికీ.. ఒక విషయంలో మాత్రం ప్రభాస్ ఎప్పటికప్పుడు అభిమానులను హర్ట్ చేస్తూనే ఉన్నాడు.

Mohan Babu about Prabhas Marriage

అదే అతని పెళ్లి విషయంలో..! అవును.. ప్రభాస్ పెళ్లి ప్రస్తావన ఆల్మోస్ట్ పుష్కరకాలం నుండి నడుస్తుంది. మొదట ‘మిస్టర్ పర్ఫెక్ట్’ టైంలో ప్రభాస్ పెళ్లి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అతను ‘బాహుబలి'(సిరీస్) కి కమిట్ అవ్వడంతో డిలే అయ్యింది. కచ్చితంగా ‘బాహుబలి 2’ పూర్తయిన వెంటనే ప్రభాస్ పెళ్లి అంటూ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. తర్వాత ‘సాహో’ అన్నారు ‘రాధే శ్యామ్’ అన్నారు. కానీ ఫైనల్ గా ఆయన చెప్పింది జరగలేదు.


ఈరోజు ప్రభాస్ 44వ పుట్టినరోజు. అతని సినిమాల అప్డేట్లు కంటే కూడా పెళ్లి అప్డేట్ కోసమే అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రభాస్ పెళ్లి కనుక కుదిరితే మొగల్తూరు, భీమవరం ఏరియాల్లో జాతర వాతావరణం మొదలైనట్టే. కానీ ఆ ముచ్చట మాత్రం తీరేలా కనిపించడం లేదు. ప్రభాస్ గురించి ఈరోజు చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అయితే ఎక్కువ శాతం ఎవ్వరూ కూడా  అతని పెళ్లి గురించి ప్రస్తావించలేదు.

కానీ మోహన్ బాబు మాత్రం ‘ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలని.. అరడజను మంది పిల్లల్ని కనాలని కోరుకుంటున్నట్టు’ ఓ ట్వీట్ వేశారు. స్టార్స్ అందరి వేసిన ట్వీట్లలో మోహన్ బాబు ట్వీట్ ప్రభాస్ అభిమానులకు నచ్చింది. అందుకే పనిలో పనిగా ‘పెదనాన్న కృష్ణంరాజు బాధ్యతను మోహన్ బాబు తీసుకుంటే బాగుణ్ణు కదా’ అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus