Mohan Babu, Chiranjeevi: బాలయ్య షోలో చిరు గురించి మోహన్‌బాబు!

టాలీవుడ్‌లో టామ్‌ అండ్‌ జెర్రీ అంటే… ఠక్కున గుర్తొచ్చే సీనియర్ స్టార్లు మోహన్‌బాబు, చిరంజీవి. ఇది ఎన్నో వేదికల మీద స్పష్టమైంది. ఒకరినొకరు గిల్లిగిచ్చుకునే కామెంట్లు చేస్తూనే ఉంటారు. కాసేపటికి ఇద్దరూ హగ్‌ చేసుకొని… ‘మేం స్నేహితులం’ అని చెప్పుకుంటూ ఉంటారు. మనం చాలాసార్లు చూశాం కూడా. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి వచ్చింది. మోహన్‌బాబు అనేశాడు. ఇక చిరంజీవినే చెప్పాలి. బాలకృష్ణ హోస్ట్‌గా ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్‌’షోకి మోహన్‌బాబు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో చిరంజీవి గురించి చెప్పండి అని మోహన్‌బాబును బాలయ్య అడిగారు. దానికి మోహన్‌బాబు చెప్పిన సమాధానం చాలా ప్రొవోకింగ్‌గా ఉంది అని అభిమానులు అంటున్నారు. కావాలనే గిల్లాలనే ఉద్దేశంతోనే మోహన్‌బాబు అలా అన్నారా? లేక సరదాగా అన్నారా? అనేది తెలియాలి అనుకుంటున్నారు. ‘‘చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తాడు. అతనిపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. అల్లు రామలింగయ్యగారి కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. సురేఖ నాకు సోదరిలాంటిది.

అంటే మన ఇంటి అమ్మాయిని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టే అతను బాగున్నాడు’ అని సమాధానం ఇచ్చారు మోహన్‌బాబు. కేవలం సురేఖను పెళ్లి చేసుకోవడం వల్లే చిరంజీవి బాగున్నాడు అనడం ఎంతవరకు సమంజసం అనేది ఆయనే చెప్పాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus