మంచు మోహన్ బాబుకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా, రాజకీయనేతగా మోహన్ బాబు పాపులారిటీని సంపాదించుకున్నారు. స్వర్గం నరకం అనే సినిమాతో మోహన్ బాబు నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టగా గత కొంతకాలం నుంచి మోహన్ బాబు పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.
సన్నాఫ్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ మా గురువు దాసరి నారాయణరావు గారు సినిమా నా ఊపిరి అని అన్నారని నా కుటుంబానికి సినిమా ఊపిరి అని తెలిపారు. యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా సంపాదించిన డబ్బులను విద్యాసంస్థలలో పెట్టానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అది ప్రస్తుతం యూనివర్సిటీ అయిందని ఇంతకంటే విజయాల గురించి చెప్పుకోనని మోహన్ బాబు తెలిపారు.
1982 సంవత్సరంలో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి నేనే హీరోగా, నిర్మాతగా సినిమా తీయాలని భావించానని టాప్ రైటర్ సుందర్ కన్నడ మూవీ అయిన అనబలం జనబలం సినిమాకు కథ అందించగా ఆ సినిమా ఫ్లాప్ అయినా ఆ మూవీ రీమేక్ లో నటించాలని డిసైడ్ అయ్యానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఫ్లాపైతే ఇల్లు అమ్ముకొని వెళ్లాలని కానీ సినిమా హిట్ అయిందని మోహన్ బాబు అన్నారు.
ఒక పెద్ద సినిమాకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ సాధించానని మోహన్ బాబు పేర్కొన్నారు. సన్నాఫ్ ఇండియా సినిమాలో రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించామని మోహన్ బాబు వెల్లడించారు. ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం కోటీ 80 లక్షల రూపాయలు ఖర్చు చేశామని మోహన్ బాబు గ్యాస్ కొట్టడని డబ్బా కొట్టడని ఈ సాంగ్ చూస్తే నిజంగా అంత ఖర్చు చేశామో లేదో మీకే అర్థమవుతుందని మోహన్ బాబు కామెంట్లు చేశారు.