Mohan Babu, Mahesh Babu: మహేష్ బాబు మూవీలో కలెక్షన్ కింగ్ నటిస్తారా?

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలలో ఖలేజా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. బుల్లితెరపై ఖలేజా సినిమా హిట్టైనా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా ఫ్లాప్ అనే చెప్పాలి. ఖలేజా సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో ఇతర భాషల నటులను నటింపజేయాలని త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నా ఇతర భాషల్లో మంచి గుర్తింపు ఉన్న నటులు దొరకడం లేదని సమాచారం. అందువల్ల టాలీవుడ్ పాపులర్ నటులకు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నారని బోగట్టా.

మహేష్ బాబు సినిమాలో కలెక్షన్ కింగ్ నటిస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండగా త్రివిక్రమ్ ఈ సినిమా కొరకు 30 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటున్నారు.

ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా 2023 సంవత్సరంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. త్రివిక్రమ్ మోహన్ బాబును సంప్రదిస్తే ఆయన ఈ సినిమాకు నో చెప్పే అవకాశం అయితే ఉండదు. త్రివిక్రమ్ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారని బోగట్టా.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus