తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన కార్యక్రమం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్ బాబు పాల్గొన్నారు. అయితే మోహన్ బాబు స్పీచ్ మధ్యలో శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యారు. మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి మాట్లాడవద్దని మోహన్ బాబు మధుమితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
పెద్దలు స్పీచ్ ఇస్తున్న సమయంలో వెనుక నుంచి మాట్లాడటం, సైగలు చేయడం వల్ల చెప్పే ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయని మోహన్ బాబు సున్నితంగా హెచ్చరించారు. వెనుక నుంచి మాట్లాడుకోవడం తనకు నచ్చదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. మోహన్ బాబు తన స్పీచ్ లో తన లైఫ్ తెరిచిన పుస్తకమని తాను హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశానని తెలిపారు. మనమంతా ఒకే తల్లి బిడ్డలమని మనుషుల్లో ప్రతిభ ఉంటే మాత్రమే అవకాశాలు వస్తాయని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. తనది 47 సంవత్సరాల నట జీవితమని మోహన్ బాబు అన్నారు.
కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారని ఆ బెదిరింపులకు తాను భయపడనని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవి పెద్ద బాధ్యత అని అది చిన్న ఉద్యోగం కాదని మోహన్ బాబు కామెంట్లు చేశారు. సభ్యులకు ఏవైనా సమస్యలు ఉంటే అధ్యక్షుడితో చర్చించి పరిష్కరించుకోవాలని మోహన్ బాబు వెల్లడించారు.
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!