ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. కెరీర్ తొలినాళ్లలో విలన్ రోల్స్ లో, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన మోహన్ బాబు ఆ తర్వాత హీరో రోల్స్ లో నటించి పాపులారిటీని పెంచుకున్నారు. అయితే కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన అవమానాల గురించి మోహన్ బాబు అలీతో సరదాగా షోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న మోహన్ బాబు సొంతంగా విద్యాసంస్థను నడిపిస్తున్నారు.
సినిమాల్లోకి రాకముందు స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా తాను పని చేశానని ఆ సమయంలో తన సంపాదన కేవలం 140 రూపాయలు అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. సంవత్సరం పాటు డ్రిల్ మాస్టర్ గా పని చేసిన తర్వాత స్కూల్ లోని గ్రూపుకు సంబంధించిన కులం వ్యక్తిని కాకపోవడంతో తన ఉద్యోగం పోయిందని మోహన్ బాబు వెల్లడించారు. ఆ సమయంలో తాను ఎంతో బాధ పడ్డానని మోహన్ బాబు పేర్కొన్నారు.
విద్యానికేతన్ స్కూల్ ను స్థాపించిన తర్వాత తాను అడ్మిషన్ ఫామ్ లో కులం అనే కాలమ్ ను తొలగించానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. సినిమాలలో వేషాలు అడగడానికి వెళ్లిన సమయంలో తాను రాయలసీమకు చెందిన వ్యక్తిని కావడంతో బాష ఏం తెలుసని ప్రశ్నించారని ఆ తర్వాత కొన్ని పుస్తకాలు చదివి భాష నేర్చుకున్నానని మోహన్ బాబు తెలిపారు. మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా మూవీ త్వరలో రిలీజ్ కానుంది.