Mohan Babu: ‘మా’ ఫలితాలపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మోహన్ బాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ తుది ఫలితాలు వెల్లడైన తర్వాత మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ సింహం నాలుగు అడుగులు వెనక్కు వేసిందంటే ఆలోచించుకోవడం కోసమే అని ఆ తర్వాత విజృంభిస్తుందని మోహన్ బాబు తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు తన కొడుకు విష్ణుకు ఆశీస్సులు అందించారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

ఏదైనా భగవంతుడు, కాలం నిర్ణయాలకు అనుగుణంగానే జరుగుతుందని 17 సంవత్సరాల క్రితం తాను అక్టోబర్ 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యానని మోహన్ బాబు తెలిపారు. విష్ణు కూడా అదే తేదీన ఎన్నిక కావడం భగవంతుని నిర్ణయమేనని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారని తాను అసమర్థుడిని కాదని మోహన్ బాబు కామెంట్లు చేశారు. ప్రతిదానికి మౌనంగా ఉండాలని అన్నీ నవ్వుతూ స్వీకరించాలని ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెప్పాలని మోహన్ బాబు పేర్కొన్నారు.

మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలని మోహన్ బాబు సూచనలు చేశారు. ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉండవచ్చని ఇక్కడ మాత్రం అందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పార్టీ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. గెలిచిన వాళ్లంతా రేపు క్వశ్చన్ పేపర్ అవుతారని ముఖ్యమంత్రుల సహకారం లేకపోతే అడుగు వేయలేవంటూ మోహన్ బాబు విష్ణుకు సూచనలు చేశారు. గతంలో సీఎంలను కళాకారులు సత్కరించేవారని ఇప్పుడు కూడా సత్కరించాలని మోహన్ బాబు వెల్లడించారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus