Mohan Babu: జయసుధ ఫోన్ లాగేసుకున్న మోహన్ బాబు.. వీడియో వైరల్!
- September 20, 2023 / 10:46 PM ISTByFilmy Focus
దివంగత స్టార్ హీరో, అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. అంతేకాకుండా.. ఈరోజు ఏఎన్నార్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అల్లు అరవింద్, మోహన్ బాబు, బ్రహ్మానందం, మురళీ మోహన్,రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, మహేష్ బాబు,జయసుధ వంటి వారు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ తో ఉన్న అనుబంధాన్ని ఈ స్టార్లంతా వ్యక్తపరచడం జరిగింది.
ఇదిలా ఉండగా .. ఈ వేడుకలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అక్కినేని కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు.. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్పీచ్ లు ఇస్తున్న టైంలో జయసుధ మాత్రం ఫోన్లో బిజీగా ఏదో చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె పక్కనే ఉన్న మోహన్ బాబు.. అది చూసి సీరియస్ అయ్యి.. జయసుధ చేతిలో ఉన్న ఆమె ఫోన్ ను లాక్కునే ప్రయత్నం చేశారు.

ఒక్కసారిగా షాక్ అయిన జయసుధ.. (Mohan Babu) మోహన్ బాబు పై మొదట సీరియస్ లుక్ ఇచ్చినప్పటికీ.. తర్వాత ఓ నవ్వు నవ్వేసి స్పీచ్ ఇస్తున్న వ్యక్తుల వైపు చూసి కవర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోహన్ బాబు ఏ వేడుకకి వచ్చినా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటాయి. ఆయన కోపం గురించి తెలిసిన వారు ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు తప్ప విమర్శలు వంటివి అయితే చేయడం లేదు.
ఫోన్ పట్టుకొని కూర్చున్న జయసుధ ఫోన్ లాగేసిన మోహన్ బాబు. #ANRLivesOn #CelebratingANR100 pic.twitter.com/IcsDTT5RJe
— Actual India (@ActualIndia) September 20, 2023
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!












