Mohan Babu, Mahesh Babu: మహేష్-త్రివిక్రమ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

పాత సినిమాల్లో ఆర్టిస్ట్ లను మళ్ళీ తమ సినిమాల ద్వారా పరిచయం చేస్తుంటారు త్రివిక్రమ్, కొరటాల, బోయపాటి శ్రీను. ప్రస్తుతం మనం త్రివిక్రమ్ గురించి చెప్పుకోవాల్సి ఉంది. చాలా కాలం తర్వాత టబు ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆమెతోనే డబ్బింగ్ కూడా చెప్పించారు. ఇప్పుడైతే మరీ అంత వెనక్కి వెళ్లడం లేదు కానీ… కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కోసం తన సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ ను డిజైన్ చేసుకున్నారట.

మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న మూవీ కోసం మోహన్ బాబుని ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం జరిగిందట. ఆయన నాలుగు సెటైర్లు వేసి.. చేస్తానని కానీ చెయ్యను అని కానీ ఇంకా చెప్పలేదట. అయితే త్రివిక్రమ్ బాగా కన్విన్స్ చేసినట్టు తెలుస్తుంది. మోహన్ బాబు ప్రస్తుతం రిటైర్ అయ్యే స్టేజిలో ఉన్నారు. కాబట్టి కాస్త పేరు తెచ్చిపెట్టే పాత్రలే ఆయన చేయాలని తాపత్రయపడుతున్నారు. ‘మహానటి’ ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సినిమాల్లో మోహన్ బాబు చేసిన పాత్రలకి మంచి పేరే వచ్చింది.

ఆ సినిమాల్లో కొత్త మోహన్ బాబుని చూసారు ప్రేక్షకులు. వాటిలానే త్రివిక్రమ్ సినిమాలో కూడా మోహన్ బాబు పాత్ర ఉంటుందని వినికిడి.మోహన్ బాబు కనుక ఈ ప్రాజెక్టులో భాగమైతే కచ్చితంగా అందరిలో ఆసక్తి పెరుగుతుంది.’కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో మోహన్ బాబుతో కలిసి నటించాడు మహేష్.మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కలిసి నటిస్తారా లేదా అనే దానిపై త్వరలోనే పై క్లారిటీ రానుంది. ఏప్రిల్ నుండీ మహేష్- త్రివిక్రమ్ ల మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్టు చిత్ర బృందం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు తమన్.. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించాడు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus