Mohanlal: మోహన్ లాల్ కొన్న లగ్జరీ కారు ఖరీదు ఎంతో తెలుసా?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్తకారులను కొనుగోలు చేస్తూ ఉంటారు ఇలా ఎంతో మంది సెలెబ్రెటీలు ఖరీదైన లగ్జరీ కార్లను వారి గ్యారేజ్ లో పెట్టుకుంటారు. అయితే తాజాగా నటుడు మోహన్ లాల్ సైతం ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అయితే మోహన్ లాల్ గ్యారేజ్ లో ఉన్న వాటిలో అత్యంత ఖరీదైన కారు ఇదేనని తెలుస్తోంది.మరి ఈయన ఏ కారు కొనుగోలు చేశారు దాని ధర ఎంత ఏంటి అనే విషయానికి వస్తే…

మోహన్ లాల్ (Mohanlal) తాజాగా బ్రిటన్ కు చెందిన కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్ కొత్త మోడల్ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ఖరీదు సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేస్తుందని సమాచారం.ఇక ఇప్పటివరకు మోహన్ లాల్ వద్ద ఉన్నటువంటి కార్లలో అత్యంత ఖరీదైన కారు ఇదేనని తెలుస్తోంది. మరి ఈయన గ్యారేజ్లో ఏ ఏ కార్లు ఉన్నాయి వాటి విలువ ఎంత అనే విషయానికి వస్తే…

ఈయన గ్యారేజ్ లో మూడు కోట్ల రూపాయలు విలువ చేసే లంబోర్ఘిని కారును కలిగి ఉన్నారు. అదేవిధంగా టయోటా వెల్ ఫైర్ కారు కూడా ఉంది. ఇది సుమారు కోటి రూపాయల విలువ చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ 350 ఈ కారు సుమారు 80 లక్షల రూపాయల విలువ చేస్తుంది. దీనితోపాటు టయోటా ల్యాండ్ క్రూయీజర్ ఈ కారు సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేస్తుంది. అయితే వీటన్నింటి కన్నా ఎంతో ఖరీదైనటువంటి రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు.

ఇక తాజాగా ఈయన కొనుగోలు చేసిన ఈ కారు అత్యంత ఖరీదైనదని తెలుస్తోంది. ఇలా తమ అభిమాన హీరో ఖరీదైన కారును కొనుగోలు చేశారని విషయం తెలియడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక మోహన్ లాల్ ప్రస్తుతం వరుస తమిళ తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో ఈయన జనతా గ్యారేజ్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus