Kannappa: కాస్టింగ్‌ సైజ్‌ రోజు రోజుకు పెరుగుతోందిగా… ‘కన్నప్ప’ లెక్కే వేరు!

టాలీవుడ్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. అంటే ఇంకా స్టార్ట్‌ అవ్వలేదు కానీ… తెరకెక్కినప్పుడు మాత్రం అది అత్యంత భారీ పాన్‌ ఇండియా సినిమా అనే చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు, విషయాలు మామూలు బజ్‌ను తీసుకురావడం లేదు. ఇంకా సినిమా స్టార్ట్‌ అయితే ఇంకాస్త భారీతనం వస్తుంది అని చెప్పాలి. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది మేం చెబుతున్నది ‘కన్నప్ప’ సినిమా గురించే అని. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా గురించే.

‘కన్నప్ప’ పేరుతో భక్త కన్నప్ప జీవితాన్ని సినిమాగా చేయాలని మంచు విష్ణు ఎప్పుడో ఫిక్స్‌ అయిపోయారు. అయితే వివిధ కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. కథకులు, దర్శకులు, నిర్మాతలు మారుతూ వచ్చారు. ఎట్టకేలకు ఓ బాలీవుడ్‌ టీవీ సీరియల్‌ దర్శకుణ్ని తీసుకొచ్చి మంచు విష్ణు ఇటీవల సినిమాకు కొబ్టరికాయ కొట్టించారు. అయితే ఈ సినిమాలో నటిస్తున్నారు అంటూ కొంతమంది నటుల గురించి వస్తున్న వార్తలు సినిమాకు మామూలు హైప్‌ ఇవ్వడం లేదు. తాజాగా ఆ కాస్టింగ్‌కి మరో స్టార్‌ నటుడు యాడ్‌ అయ్యారు.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కన్నప్ప’ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్‌, నయనతార భాగమయ్యారని స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ కూడా సినిమా కాస్టింగ్‌లో చేరారు. ఈ మేరకు మంచు విష్ణు టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల మోహన్‌ లాల్‌ను విష్ణు కలసినప్పుడు తీసిన ఫొటోను షేర్‌ చేస్తూ ఈ విషయాన్ని చెప్పకొచ్చింది.

న్యూజిలాండ్‌లో త్వరలో ‘కన్నప్ప’ సినిమా మొదలవుతుంది. ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తారని సమాచారం. 800 మంది సిబ్బందితో ఐదు నెలల పాటు ఆర్ట్‌ వర్క్‌ పూర్తి చేశారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది. ముందుగా అనుకున్న నుపుర్‌ సనన్‌ సినిమా నుండి తప్పుకుంది. అన్నట్లు ఈ సినిమాలో ప్రభాస్‌ శివుడిగా, నయనతార పార్వతి దేవీగా కనిపిస్తారట.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus