భారీ బడ్జెట్ సినిమాకి దర్శకుడిగా మోహన్ లాల్!

సౌత్ ఇండియా సూపర్ స్టార్లలో మోహన్ లాల్ ఒకరు. మలయాళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ‘దృశ్యం’ సీక్వెల్ తో మరో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అమెజాన్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఇదే గనుక థియేటర్లో రిలీజై ఉంటే భారీ వసూళ్లను రాబట్టేది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మోహన్ లాల్ ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ను చేపట్టనున్నారు.

దాదాపుగా నలభై ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉన్న మోహన్ లాల్ తొలిసారి దర్శకుడిగా మారబోతున్నాడు. నిజానికి మోహన్ లాల్ కి చాలా కాలంగా ఓ సినిమాను డైరెక్ట్ చేయాలని కల. కానీ కుదరలేదు. తన మిత్రుడు స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ తో కలిసి మోహన్ లాల్ ఎన్నో సినిమాల కథా చర్చల్లో భాగస్వామిగా ఉండేవారు. ఇప్పుడు ఆ అనుభవంతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అది కూడా ఓ భారీ బడ్జెట్ సినిమాతో కావడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..

‘బారోజ్’. దాదాపు 400 ఏళ్ల క్రితం వాస్కోడిగామా దగ్గరున్న భారీ నిధికి కాపలాదారుడిగా ఉన్న బారోజ్ అనే కల్పిత పాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో మోహన్ లాల్ లీడ్ రోల్ పోషించబోతున్నారు. ఆయనే నటిస్తూ దర్శకత్వం కూడా చేయబోతున్నారు. ఈ సినిమాకి స్టార్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. మార్చి నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus