Mokshagna: నందమూరి ఫ్యాన్స్ కు ఇది నిజంగా శుభవార్తేగా!

  • June 11, 2022 / 03:20 PM IST

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం వరుస విజయాలతో జోరుమీదుండగా మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బోయపాటి శ్రీను లేదా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మోక్షజ్ఞ నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ లుక్ విషయంలో గతంలో విమర్శలు వచ్చాయి. మోక్షజ్ఞ బరువు తగ్గాలని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇతర హీరోలకు గట్టి పోటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకున్నారు.

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ ఒక ఫోటోను షేర్ చేయగా ఈ ఫోటోలో స్లిమ్ లుక్ లో మోక్షజ్ఞ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టైల్ గా, ఫిట్ గా కనిపించడంతో వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని అభిమానులు సైతం ఫిక్స్ అవుతున్నారు. ఫ్యాన్స్ మోక్షజ్ఞ లుక్ ను ను చూసి ఫిదా అవుతున్నారు. బుల్లెట్ పై మోక్షజ్ఞ స్టైలిష్ గా కనిపించి లుక్స్ తో మెప్పించారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.

ఆదిత్య369 సీక్వెల్ లో మోక్షజ్ఞ నటించే ఛాన్స్ ఉందని ఇదే మోక్షజ్ఞ తొలి సినిమా అని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞకు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా సపోర్ట్ చేస్తే మోక్షజ్ఞ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లతో సత్తా చాటే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడం ద్వారా మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే మోక్షజ్ఞ విషయంలో బాలయ్య మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus