Mokshagna: బావ కోసం ఆ కార్యక్రమంలో పాల్గొన్న మోక్షజ్ఞ.. ఏం జరిగిందంటే?

  • December 12, 2023 / 12:29 PM IST

నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత కోసం బాలయ్య అభిమానులు ఎదురుచూస్తుండగా 2024 సంవత్సరంలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఆదిత్య 999 మ్యాక్స్ అవుతుందో లేక మరో సినిమా అవుతుందో తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ల జాబితాలో ఇండస్ట్రీకి చెందిన చాలామంది క్రేజీ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. బాలయ్య, మోక్షజ్ఞ కాంబోలో మల్టీస్టారర్ గా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.

బాలయ్య ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండగా మోక్షజ్ఞ కూడా ఒకే సమయంలో ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్ట్ లను ప్రకటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి బాలయ్య చిన్న కూతురు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఇంతకాలం పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మోక్షజ్ఞ యువగళం పాదయాత్రలో బావ లోకేశ్ తో కలిసి కాలు కదపగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మోక్షజ్ఞ స్లిమ్ లుక్ లో కనిపిస్తున్న ఫోటోలు నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మోక్షజ్ఞ యువగళం పాదయాత్రలో కనిపించడంతో నారా, నందమూరి అభిమానులు మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కాలని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో మోక్షజ్ఞ (Mokshagna) కెరీర్ పరంగా సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మోక్షజ్ఞ బాలయ్య స్థాయిలో సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది. బాలయ్య సినిమాలతో పాటు రాజకీయాల్లో సైతం సత్తా చాటుతుండగా మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus