Mokshagna, Sreeleela: బాలయ్యకు మోక్షజ్ఞ వార్నింగ్‌ నిజమేనా? అందుకే ఫొటోలో ఉన్నాడా!

బాలకృష్ణ – శ్రీలీల కలసి ఓ సినిమాలో నటించారు, త్వరలో సినిమా రిలీజ్‌ అవుతోంది కూడా. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో టాక్‌ వాళ్లిద్దరూ గురించి మాత్రమే కాకుండా మోక్షజ్ఞ – శ్రీలీల గురించి కూడా వినిపిస్తోంది. ఇద్దరూ కలసి నటిస్తారు అనేది కొద్ది రోజుల క్రితం వచ్చిన పుకారు. అది జరుగుతుందో లేదో తెలియాలంటే మోక్షజ్ఞ తొలి సినిమా ఎప్పుడు అనేది తేలాలి. కానీ ఇటీవల బయటకు వచ్చిన ఓ ఫొటో ఆ వార్తలకు, మొన్న ‘భగవంత్‌ కేసరి’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాటలకు ఊతం ఇచ్చేలా ఉంది.

ఇటీవల హన్మకొండలో నేలకొండ ‘భగవంత్‌ కేసరి’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అందులో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘తర్వాతి సినిమాలో శ్రీలీల హీరోయిన్‌ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ మాట విన్న నా కుమారుడు మోక్షజ్ఞ ‘గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ, శ్రీలీల నా పిల్ల’ అంటూ ఏదో అన్నాడు’’ అంటూ బాలకృష్ణ చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. (తండ్రిని కొడుకు అలా అంటాడా? అనే లాజిక్‌లు మాట్లాడకూడదు ఇక్కడ. విషయం అర్థం చేసుకోవాలంతే)

ఇప్పుడు ఆ టాపిక్‌ గురించి ఎందుకు అనుకుంటున్నారా? ‘నా పిల్ల’ అంటూ దేవరకొండ బ్రదర్స్‌ స్టైల్‌లో మోక్షజ్ఞ అన్నాడంటున్నాడు అనే టాక్‌ నడుస్తుండగానే మోక్షజ్ఞ – శ్రీలీల ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అయితే పక్కన బాలయ్య కూడా ఉన్నాడు అనుకోండి. ఆ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ‘భగవంత్‌ కేసరి’ సినిమా ఆఫీసులోనే టీమ్‌తో ఆ ఫొటో దిగినట్లు అర్థమవుతోంది. అందులో దర్శకుడు, నిర్మాత కూడా ఉన్నారు.

ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ‘ఆ రోజు బాలయ్య చెప్పింది నిజమేనేమో.. అందుకే శ్రీలీల పక్కన మోక్షజ్ఞ చేరిపోయాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు అయితే ‘మోక్షజ్ఞ డెబ్యూలో ఈ కాంబినేషన్‌ పడితే అదిరిపోతుంది’ అని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు అక్కడ ఏం జరిగిందో బాలయ్యనే చెప్పాలి. లేదంటే శ్రీలీల అయినా చెప్పాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus