ప్రస్తుతం ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టారు. మలయాళ హీరో అయిన దుల్కర్ సల్మాన్ భాషతో సంబంధం లేకుండా పాపులారిటీని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మహానటి, సీతారామం సినిమాలతో దుల్కర్ సల్మాన్ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు చేరాయి. మరో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ పుష్ప ది రైజ్ సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
మరో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నారు. మోహన్ లాల్ గాండీవం సినిమాలో ఒక పాటలో మెరిశారనే సంగతి తెలిసిందే. మరో మలయాళ స్టార్ హీరో తెలుగులో పలు సినిమాలలో నటించినా యాత్ర సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. సురేష్ గోపీ, జయరామ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఉన్ని ముకుందన్, దేవ్ మోహన్, బిజు మీనన్ తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
మలయాళ నటుడు అయిన రెహమాన్ కు కూడా తెలుగులో మంచి గుర్తింపు ఉంది. అయితే దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, దేవ్ మోహన్ మాత్రం తెలుగులో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పటికే ఇతర ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తమిళ, కన్నడ హీరోలు సైతం టాలీవుడ్ లో మంచి పేరును సొంతం చేసుకున్నారు.
మరి మలయాళ హీరోలు సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతారో లేదో చూడాల్సి ఉంది. ఒక సినిమా సక్సెస్ సాధించినంత మాత్రాన హీరోలకు మంచి గుర్తింపు వస్తుందని చెప్పలేం. తర్వాత సినిమాలు కూడా ఊహించని స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంటే మాత్రమే రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ హీరోలలో ఎంతమంది హీరోలు టాలీవుడ్ లో పాగా వేస్తారో చూడాల్సి ఉంది.