బిగ్‌బాస్‌ 4లో ‘డాగ్‌ అండ్‌ ది బోన్‌’ గేమ్‌లో గెలుపెవరిదో?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో సీరియస్‌ నెస్‌ తీసుకురావడానికి నాగార్జున నిన్న కొంచె కఠినంగా వ్యవహరించాడు. మాట, చేత, ఆట అన్నింటిలో సీరియస్‌ నెస్‌ చూపించాడు. అయితే ఈ రోజు సండే కదా… అంటే ఫన్‌డే. అందుకే హౌస్‌ మేట్స్‌ మూడ్‌ మార్చేశాడు. సరదా మాటలు, పాటలు, ఆటలతో ఫన్‌ మూడ్‌ తీసుకొచ్చేశాడు. హౌస్‌మేట్స్‌తో ‘డాగ్‌ అండ్‌ ది బోన్‌’ గేమ్‌ కూడా ఆడించాడు. కళ్యాణితో బిగ్‌బాంబ్‌ వేయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా మోనాల్‌ను ఏడిపించాడు కూడా. ఎలిమినేషన్‌ నుంచి సేఫ్‌ అయ్యే వారి పేరు చెప్పడానికి ఏటా బిగ్‌బాస్‌ వాడే బెలూన్‌ బ్లాస్ట్‌ స్టైల్‌ ఈ రోజు కూడా వాడారు. అందులో ఎవరు బయటపడ్డారో చూడాలి. అయినప్పటికీ ఇంట్లో వాళ్లలో ఉత్సాహం రాలేదు.

దీంతో డాగ్‌ అండ్‌ ది బోన్‌ గేమ్‌ను దించాడు. మధ్యలో ఓ సర్కిల్‌ పెట్టి ఎమకు పెట్టి.. ఇద్దరిని రంగంలోకి దింపాడు. ఒకరికి దొరకకుండా ఆ ఎముకను మరొకరు లాగేయాలి. ఇందులో మెహబూబ్‌, సోహైల్‌ గట్టిగానే పట్టుపట్టి నవ్వులు పూయించారు. అమాయకచక్రవర్తి.. బలైపోతాడు’ అంటూ అవినాష్‌కు కళ్యాణి పంచ్‌ వేసే ప్రయత్నం చేయగా… ‘నా కంటే మీరే ముందు బలైపోయారు’ అంటూ అవినాష్‌ రిటర్న్‌ కౌంటర్‌ వేశాడు. వెళ్లిపోతూ వెళ్లిపోతూ దేవీ నాగవల్లిని తక్కువ అంచనా వేయొద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చింది కళ్యాణి. పచ్చమిర్చిని అమ్మ రాజశేఖర్‌ పరపర నమిలేయడం అయితే వామ్మో అనిపించింది. అన్నట్లు సోహైల్‌తో మరోసారి 50 పుషప్స్‌ తీయించాడు నాగ్‌. ఆఖరులో గంగవ్వ బోన్‌ను పట్టుకోవడం అయితే మీరు తప్పక చూడాల్సిందే.

ఇక ఎలిమినేట్‌ అయ్యేవాళ్లు వేసే బిగ్‌బాంబ్‌ విషయంలో ఏదో జరగినట్లుంది. కళ్యాణి ఆశ్చర్యపోయే రీతిలో ఆ బిగ్‌బాంబ్‌ను రూపొందించాడు బిగ్‌బాస్‌. మర కళ్యాణి ఆ బిగ్‌బాంబ్‌ ఎవరి మీద వేసిందో తెలియదు కానీ… మోనాల్‌ మాత్రం తెగ ఏడ్చేసింది. చూద్దాం ఈ ఏడపునకు, బిగ్‌బాంబ్‌కు ఏమైనా సంబంధం ఉందా? లేక ఎలిమినేట్‌ అయినవారి గురించి మోనాల్‌ ఏడ్చిందో రాత్రికి తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus