లాక్ డౌన్ టైంలో జనాలు ఒటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి టిక్ టాక్ కంటే దారుణంగా ఎడిక్ట్ అయిపోయారు. కనీసం రోజుకో సినిమా చూడకుండా ఉండడం లేదు జనాలు. దాంతో ఒటీటీ ఒనర్స్ అందరు కొత్త, పాత తేడా లేకుండా తెగ సినిమాలు కొనేసి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ రేస్ లో మొన్నటివరకూ అల్లు అరవింద్ “ఆహా యాప్” వెనుకంజలో ఉండేది. కంటెంట్ బ్యాంక్ లేకపోవడం అందుకు కారణం..
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన కొన్ని సినిమాలు మినహా పెద్దగా కంటెంట్ లేకపోయింది ఆహా యాప్ లో. దాంతో జనాలు ఆ యాప్ ను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఆ కారణంగా ఆ యాప్ ఫెయిల్ అనే నిర్ధారణకు వచ్చేశారు విశ్లేషకులు. అయితే.. అల్లు అరవింద్ అదృష్టం పండి ఆహా యాప్ లో కొత్తగా రిలీజైన “భానుమతి రామకృష్ణ” ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుండడంతో యాప్ కి సబ్ స్క్రిప్షన్స్ గట్టిగా పెరిగాయి.
అలాగే.. నెట్ ఫ్లిక్స్ లో రిలీజై మంచి పేరు సంపాదించుకున్న “కృష్ణ అండ్ హిజ్ లీల”ను కూడా ఆహా యాప్ లో లభ్యమవుతుండడంతో.. నెట్ ఫ్లిక్స్ టారిఫ్ ను భరించలేని జనాలు హ్యాపీగా ఆహా లో చూస్తున్నారు. ఆ విధంగా మొన్నటివరకు ఫెయిల్యూర్ యాప్ గా పరిగణించబడిన ఆహా ఇప్పుడు సక్సెస్ బాట పట్టింది.
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!