Rajamouli: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కోసం మరిన్ని సర్ ప్రైజ్ లు?

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ RRR సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు సార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మునుపెన్నడూ లేని విధంగా విడుదల కాబోతోంది.. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా ఆ చిత్ర యూనిట్ సభ్యులు మరొకసారి సుదీర్ఘంగా ఆలోచనలో పడినట్లు సమాచారం.

Click Here To Watch

జనవరి 7వ తేదీన విడుదల చేయాలని అనుకొని దాదాపు సినిమాకు చేయాల్సిన ప్రమోషన్ అంతా చేసేశారు.. ముఖ్యంగా సినిమా ట్రైలర్, సినిమా పాటలు కూడా భారీగానే విడుదల చేసిన విషయం తెలిసిందే. అవన్నీ కూడా సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి చాలా ఉపయోగపడ్డాయి. ఇక మరొక సారి అదే తరహాలో ప్రమోషన్స్ క్రియేట్ చేయాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. మొత్తానికి ఎమ్ఎమ్ కీరవాణి అందించిన సంగీతం అయితే సినిమాకు తగ్గట్టుగా బాగానే ఉంది కాని ఎక్కువ రోజులు బజ్ ను కొనసాసించలేకపోయాయి.

ఇక ప్రస్తుతం రాజమౌళి మళ్లీ మునుపటి తరహాలో సినిమాకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యేలా చేయాలని అనుకుంటున్నాడు. ఇక భారీ స్థాయిలో మరొక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయాలని చూస్తున్నట్లుగా కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఐదు పాటలను విడుదల చేశారు ఇక మరొక రెండు పాటలు కూడా విడుదల చేయాల్సి ఉంది. అందులో కాలభైరవ మరొక పాట పాడినట్లు గా సమాచారం.

కానీ ఆ రెండు పాటలు కూడా సినిమాలో కథానుసారంగా వచ్చేవి అని తెలుస్తోంది. కాబట్టి ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. కుదిరితే అల్లూరి సీతారామరాజు అలాగే సీత మధ్యలో ఉండే ఒక మంచి పాటను విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా రాజమౌళి మరొక పవర్ ఫుల్ టీజర్ లేదా ట్రైలర్ను విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus