Jr NTR: ఆ మార్ఫింగ్ ఫోటో వల్ల హర్ట్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ తో బిజీగా ఉండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ మూవీలో జాన్వీ కపూర్ రోల్ సైతం కొత్తగా ఉండనుందని ఎన్టీఆర్ ను మోసం చేసే పాత్రలో ఆమె కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ సమయానికి పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని తారక్ భావిస్తున్నారు.

దేవర సినిమాలో రక్తాలు ఏరులై పారతాయని యాక్షన్ సన్నివేశాలు కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఎంపికయ్యారని ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని బోగట్టా. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో తారక్ సినిమాలకు సంబంధించిన వరుస అప్ డేట్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రముఖ న్యూస్ ఛానెల్ పై ఫైర్ అవుతున్నారు. బ్యాగ్రౌండ్ లో జూనియర్ ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫోటోను సదరు ఛానల్ ప్రచారం చేయడం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది. ఆ ఛానల్ యాజమాన్యం మా హీరోకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్స్ కామెంట్ల విషయంలో ఆ ఛానల్ యాజమాన్యం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని తమ బ్యానర్లలో నటించాలని ప్రముఖ నిర్మాతలు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్లను ఆఫర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఆఫర్ల విషయంలో తారక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus